ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు మార్చొద్దు

ABN , First Publish Date - 2020-04-06T06:15:42+05:30 IST

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు సవరించాలన్న ప్రమోటర్ల విజ్ఞప్తిపై నిపుణులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే సామాన్య ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉందని...

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు మార్చొద్దు

న్యూఢిల్లీ : ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు సవరించాలన్న ప్రమోటర్ల విజ్ఞప్తిపై నిపుణులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే సామాన్య ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇన్‌సైడర్‌ పరిధిలోకి వచ్చే లిస్టెడ్‌ కంపెనీల ప్రమోటర్లు డైరెక్టర్లు, ఆడిటర్లు, మేనేజ్‌మెంట్‌ వ్యక్తులు త్రైమాసికం ముగిసిన రోజు నుంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించిన 48 గంటల వరకు ఆయా కంపెనీల షేర్లలో ఎలాంటి లావాదేవీ లు జరపకూడదు. కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం, మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకటన గడువును జూన్‌ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో చాలా కంపెనీల ప్రమోటర్లు ట్రేడింగ్‌ నిబంనలనూ సవరించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-04-06T06:15:42+05:30 IST