Abn logo
Sep 23 2021 @ 00:41AM

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తనిఖీ

- సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

ధర్మవరం, సెప్టెంబరు 22: పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యేకేతి రెడ్డి వెంకటరామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, ఈసీ ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతోంది తదితర వాటిని సబ్‌రిజిస్ట్రార్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయం ఎదుట రోజు ఇంతమంది ఎందుకున్నారని ప్రశ్నించారు. 700 రిజిస్ట్రేషన్లు చేసినా స్కానింగ్‌ చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈసీలు కూడా ఇవ్వడానికి నెల రోజులు ఎందుకవుతుందని సిబ్బం దిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో పనులు ఆలస్య మవుతున్నాయని విన్నవించారు. గతంలో అవినీతికి పాల్పడుతుంటే కేసులు కూడా నమోదు చేయించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చ రించారు. ఏ రోజుకు ఆరోజు రిజిస్ట్రేషన్‌లు చేసి పంపించాలని పెండింగ్‌లో పెడితే సహించేదిలేదన్నారు. అనంతరం ఆయన డీఐజీకి ఫోన్‌చేసి 700 రిజిస్ట్రేషన్‌లు చేసినా స్కానింగ్‌ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బంది కొరతను తీర్చాలని ఆయన కోరారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.