Abn logo
Sep 20 2021 @ 23:18PM

విత్తనాల దుకాణంలో అధికారుల తనిఖీ

రికార్డులను పరిశీలిస్తున్న ఏడీఏ సురేష్‌రెడ్డి, డీఎస్పీ ప్రసాద్‌రావు

నాసిరకం బీర విత్తనాలపై ఆరా

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబరు 20: మండల పరిధిలోని శీతంపల్లె, ఎర్రగుంట్లపల్లె, సగిలిగుడ్డుపల్లె, చాపాడు మం డలంలోని అయ్యవారిపల్లె గ్రామాల్లో రైతులు సాగు చేసిన బీర పంట విత్తనాలు నాశిరకం అన్న ఫిర్యాదుపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆమేరకు సోమవారం ఏడీఏ సురేష్‌రెడ్డి, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావులు కలిసి భార త్‌ సీడ్స్‌ దుకాణం రికార్డులను తనిఖీ చేశారు. దుకాణంలోని రిజిష్టర్లు, బిల్‌బుక్కు, ఎక్కడెక్కడి నుంచి విత్తనాలు వచ్చాయి  అన్న అంశాలపై వారు పరిశీలించారు. బీర విత్తనాల బిల్లులు, కంపెనీ ఇన్‌వాయిస్‌ పరిశీలించారు. ఫిర్యాదు వచ్చిన విత్తనా లను ఎవరికి అమ్మకూడదని వారు దుకాణపు యజమానిని ఆదేశించారు. శాస్త్రవేత్తలు వచ్చి ఫిర్యాదుదారుల పంటను పరిశీలించి నివేదిక వచ్చిన తర్వాతనే ఆ కంపెనీ విత్తనాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా రైతులకు నకిలీ విత్త నాలు అంటగడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లైసెన్సు రద్దు చేస్తామని వారు సూచించారు.