గిడ్డంగుల కోసం ప్రభుత్వస్థలం పరిశీలన

ABN , First Publish Date - 2020-05-27T10:04:45+05:30 IST

కులకచర్ల గ్రామ పరిధిలోని ఘనాపూర్‌ గేట్‌ వద్ద గల ప్రభు త్వ భూమిని కలెక్టర్‌ పౌ సుమిబసు మంగళవా రం పరిశీలించారు

గిడ్డంగుల కోసం ప్రభుత్వస్థలం పరిశీలన

కులకచర్ల: కులకచర్ల గ్రామ పరిధిలోని ఘనాపూర్‌ గేట్‌ వద్ద గల ప్రభు త్వ భూమిని  కలెక్టర్‌ పౌ సుమిబసు మంగళవా రం పరిశీలించారు. ప్రభు త్వ భూమి సర్వే నంబరు 637లో గిడ్డంగుల నిర్మా ణం కోసం 10 ఎకరాల భూమిని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభు త్వం నిలువ గిడ్డంగుల ని ర్మాణం కోసం స్థలం కావాలని కోరిందని, స్థలం కేటాయిస్తే గిడ్డంగుల నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా శీతల గిడ్డంగుల నిర్మాణం కోసం 5 ఎకరాల చొప్పున 15 ఎకరాల స్థలాన్ని పరిశీలించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వికారాబాద్‌ ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఆర్‌ఐ వెంకటగిరి, సర్వేయర్‌ ప్రసాద్‌, ఏఎ్‌సఐ కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T10:04:45+05:30 IST