పంటల నమోదు పరిశీలన

ABN , First Publish Date - 2022-08-31T03:58:40+05:30 IST

మండలంలోని ముత్తంపేట శివారులో వ్యవసాయాధికారులు చేపడుతున్న పంటల సర్వేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అధికారి మనోహర్‌ పరిశీలించారు.

పంటల నమోదు పరిశీలన
ఫర్టిలైజర్‌ దుకాణాన్ని తనిఖీ చేస్తున్న జిల్లా అధికారి మనోహర్‌

కౌటాల, ఆగస్టు 30: మండలంలోని ముత్తంపేట శివారులో వ్యవసాయాధికారులు చేపడుతున్న పంటల సర్వేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అధికారి మనోహర్‌ పరిశీలించారు. సర్వే నంబర్ల వారిగా పంటల వివరాలు ఆన్‌లైన్‌లో పొందు పరుస్తున్నట్లు తెలిపారు. పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని వ్యవసాయాధికారులు తెలిపారు.  అనంతరం ముత్తంపేట గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో దుర్గాభవానీ ఉన్నారు. 

Updated Date - 2022-08-31T03:58:40+05:30 IST