బవులవాడలో గనుల శాఖ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-26T06:08:28+05:30 IST

బవులవాడలో వెంకటశశి ప్రాజెక్టుకు సంబంధించిన క్వారీల్లో మంగళవారం గనుల శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.

బవులవాడలో గనుల శాఖ అధికారుల తనిఖీలు
బవులవాడలో క్వారీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

తుమ్మపాల, జనవరి 25: బవులవాడలో వెంకటశశి ప్రాజెక్టుకు సంబంధించిన క్వారీల్లో మంగళవారం గనుల శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. మండలంలోని క్వారీల విషయంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా గనుల శాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం నుంచి నలుగురు సభ్యులతో కూడిన ఒక బృందం అనకాపల్లి మైన్స్‌ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ శాఖ డీడీ నరసింహరెడ్డి మాట్లాడుతూ, వెంకటశశి ప్రొజెక్టుకు సంబంధించి తొమ్మిది క్వారీల్లో తనిఖీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తొలుత క్వారీల నిర్వాహణకు కేటాయించిన హద్దులను గుర్తిస్తామన్నారు. వెంకటశశి క్వారీల్లో జరిగిన వ్యాపార లావాదేవీలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి మైన్స్‌ ఏడీ విఘ్నేశ్వరుడు, సర్వేయర్‌ అమ్మాజీ, ఆర్‌ఐ అన్నపూర్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T06:08:28+05:30 IST