Abn logo
Sep 25 2021 @ 23:24PM

స్ఫూర్తి ప్రదాత దీనదయాల్‌

దీనదయాల్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, సెప్టెంబరు 25: మానవతావాద సిద్ధాంతకర ్త, అంత్యోదయ స్ఫూర్తిప్రదాత దీనదయాల్‌ అని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడి ్డ పేర్కొన్నారు. మండలంలోని దేవగుడి గ్రామంలో  శనివారం పండిట్‌ దీనదయాల్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో (అర్బన్‌): దీన్‌ దయాల్‌ స్పూర్తితో దేశసేవలో పాల్గొనాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుబ్రమణ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం స్థా నిక బీజేపీ కార్యాలయంలో దీన్‌దయాల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆంజనేయులు, మండల అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, జిల్లా కమిటీ నాయకుడు రఘరామిరెడ్డి, శ్రీనివాసులు సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ క్రిష్ణ పాల్గొన్నారు.