Abn logo
Jul 16 2021 @ 09:17AM

ఇన్‌స్టాగ్రామ్‌లో బాలిక పరిచయం ఎంత పనిచేసిందంటే..!

  • బాలికకు వేధింపులు
  • పోకిరి అరెస్టు.. రిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ : ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బాలికను వేధిస్తున్న ఓ పోకిరీని సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన లలిత్‌కుమార్‌ జైన్‌ (20) ఇన్‌స్టాగ్రామ్‌లో సికింద్రాబాద్‌కు చెందిన ఓ బాలికతో పరిచయం పెంచుకుని అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపించడం, ఆమె వ్యక్తిగత ఫొటోలు పంపించాలని బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒకే కాలేజీలో చదువుతున్నప్పటికీ ఆమె గుర్తించకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా తెరిచి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.