Abn logo
May 29 2021 @ 03:07AM

ఇన్‌స్టాగ్రామ్‌ షాపింగ్‌ ఫీచర్‌ ‘డ్రాప్స్‌’

లేటెస్ట్‌ ఉత్పత్తుల సమాచారం తెలియజేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ‘డ్రాప్స్‌’ పేరిట కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. త్వరలో మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన అలాగే రాబోతున్న ప్రొడక్ట్‌ల సమాచారం ఇందులో ఉంటుంది. స్ట్రీట్‌వేర్‌ ఫ్యాషన్‌ రంగంలో ‘డ్రాప్స్‌’ పాపులర్‌ పదం. ముఖ్యంగా తక్కువ మొత్తంలో వస్తువులను రిలీజ్‌ చేసినప్పుడు సంబంధిత సమాచారం కూడా ఈ డ్రాప్స్‌లో ఉంటుంది. యాప్‌లోని ‘షాప్‌’  సెక్షన్‌లోనే డ్రాప్స్‌ కనిపిస్తుంది. కొత్త ప్రొడక్ట్‌ల వివరాలు అందులో ఉంటాయి.


మరో విషయం, ఈ డ్రాప్స్‌తోనే నచ్చిన ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయవచ్చు. మూడో పార్టీ ప్రమేయం ఉండదు. ‘చెక్‌ అవుట్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ వేదిక ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ రకమైన డీల్స్‌లో కొనుగోలు ఫీజు వసూలు చేస్తారు.  అయితే కొవిడ్‌ సంక్షోభం కారణంగా కొనుగోలు ఫీజును వసూలు చేయటం లేదని ఇన్‌స్టాగ్రామ్‌ తెలియజేసింది. ఆడిడాస్‌, సెపోరా వంటి బ్రాండ్‌ వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యం ఈ డ్రాప్స్‌తో సమకూరుతోంది. 

ప్రత్యేకం మరిన్ని...