ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ఫీచర్‌

ABN , First Publish Date - 2021-07-03T05:30:00+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ఫీచర్‌ త్వరలో విడుదల కానుంది. ఆదరణ పొందిన ప్రొడక్ట్‌, స్టోరీల అనువాద పనిలో

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ఫీచర్‌

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ఫీచర్‌ త్వరలో విడుదల కానుంది. ఆదరణ పొందిన ప్రొడక్ట్‌,  స్టోరీల అనువాద పనిలో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచే వ్యాఖ్యలు, క్యాప్షన్లు, ప్రొఫైల్స్‌కు అనువాద సౌకర్యం అందిస్తోంది. టెక్స్ట్‌కు దిగువన ‘సీ ట్రాన్స్‌లేషన్‌’ బటన్‌ ఉంటుంది. అలాగే ఆ ఆప్షన్‌ టెక్స్ట్‌లో ఉన్న మేటర్‌ ఏయే భాషల్లో అనువాద సౌకర్యం ఉందన్నది తెలియజేస్తుంది.


యాప్‌ రీసెర్చర్‌ కథనం ప్రకారం స్టోరీలకు అనువాదంపై ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పుడు పనిచేస్తోంది.  ప్రస్తుతం ఆ పని టెస్టింగ్‌ దశలో ఉంది. తను షేర్‌ చేసిన స్ర్కీన్‌షాట్స్‌ ప్రకారం, టెక్స్ట్‌ను అనువదించే సామర్థ్యం దానికి ఉంది. ‘సీ ట్రాన్స్‌లేషన్‌’ బటన్‌తో ఇది జరుగుతోంది. కథనాల దిగువన ఈ బటన్‌ కనిపిస్తోంది. మొదట అసలు కథనం కనిపి స్తుంది. బటన్‌ నొక్కిన తరవాత పాపప్‌ బాక్స్‌ లో అనువదించిన కథనం చూడగలుగుతాం.


టెక్ట్స్‌లో ఇటాలియన్‌ పార్ట్‌ను అనువదిస్తోంది. అంతా టెక్ట్స్‌లో ఉండే స్టోరీని ఎలా ట్రాన్స్‌లేట్‌ చేస్తుందన్నది చూడాల్సి ఉంది. ఈ ఫీచర్‌ ఇంకా టెస్ట్‌ మోడ్‌లోనే ఉంది. అందుకే విని యోగదారులు అందరికీ కనిపించటం లేదు. కామెంట్లు, క్యాప్షన్స్‌, ప్రొఫైల్స్‌ అనువా దానికి ఉపయోగించిన విధానాన్నే స్టోరీలకూ అన్వయిస్తుందని భావిస్తున్నారు. విని యోగంలోకి వస్తే, స్టోరీలకు సంబంధించి మంచి ఫీచరే. ఇన్‌స్టాగ్రామ్‌ క్యాప్షన్‌ స్టిక్కర్‌ ను గత నెలలోనే విడుదల చేసింది. వీడియోల్లోని స్పీచ్‌ని ఇది ఆటోమేటిక్‌గా అనువ దిస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ ఇంకా మన దేశంలో అందుబాటులోకి రాలేదు.


Updated Date - 2021-07-03T05:30:00+05:30 IST