Advertisement
Advertisement
Abn logo
Advertisement

చపాతీ తింటావా.. పప్పన్నం తింటావా..? అని తల్లి అడిగితే ఈ బుడ్డోడి నుంచి షాకింగ్ రిప్లై.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

ఇంటర్‌నెట్‌డెస్క్: చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఉండే సందడే వేరు. బుజ్జిబుజ్జి మాటలతో, బుడిబుడి అడుగులతో ఇంట్లో తిరుగుతూ తెగ అల్లరి చేస్తుంటారు. ముద్దులొలికే చిన్నారులను చూసి తల్లిదండ్రులు సంబరపడిపోతుంటారు. పిల్లలు చేసే అల్లరిని కొంతమంది తల్లులు వీడియోలు తీస్తూ.. తర్వాత వాటిని చూసుకుంటూ ఆనందపడిపోతుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు చేసే ఏ పనైనా చూడముచ్చటగా ఉంటుంది కాబట్టి. నిష్కలమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తున్న అలాంటి పిల్లలను చూస్తే ఎవరికైనా చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఇక కబీర్ సూద్ అనే ఓ పిల్లాడి విషయానికొస్తే.. తల్లి అడిగిన ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానం విని ఆమె మొదట షాక్‌కు గురైన ఆ తర్వాత మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.


ఈ వీడియోలో కబీర్ సూద్, ఆమె తల్లి కనిపిస్తారు. ఆమె కబీర్‌ను ఎత్తుకొని చపాతీ తింటావా.. పప్పన్నం తింటావా..? అని అడుగుతుంది. దీంతో అతడు ‘కేక్’ కావాలంటూ ముద్దుముద్దుగా అడుగుతాడు. దీంతో ఆమె ఇందాకే రెండు కేకులు తిన్నావు కదా? అని అడుగుతుంది. ‘అవును.. ఇంకొకటి కావాలి..’అని కబీర్ చెబుతాడు. అతడి అమాయకపు చూపులు, ముద్దు ముద్దు మాటలు అతడి తల్లినే కాదు.. మనల్ని కూడా అలా కట్టిపడేస్తాయి. మరీ ఆ వీడియో ఏంటో చూసి మీరు కూడా ఆనందపడండి. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement