Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇన్‌స్టంట్‌ జిలేబీ

కావలసిన పదార్థాలు: మైదా - అరకప్పు, మొక్క జొన్న పొడి- స్పూను, వెనిగర్‌- అర స్పూను, పెరుగు- స్పూను, పసుపు- చిటికెడు, చక్కెర- కప్పు, యాలకుల పొడి- పావు స్పూను, నూనె, నీళ్లు- తగినంత, నెయ్యి- స్పూను.


తయారుచేసే విధానం: మొదట చక్కెర పాకాన్ని చేసి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మైదా, మొక్క జొన్న పొడి, పెరుగు బాగా కలపాలి, వెనిగర్‌ను కూడా జతచేయాలి. అవసరమైతే తగినంత నీటితో పిండిని జారుగా కలుపుకోవాలి. ఖాళీ అయిన కెచప్‌ సీసాలో ఈ పిండిని వేసి మూతపెట్టాలి. బాణలిలో నూనె కాగాక సీసానుంచి జిలేబీలను చుట్టాలి. బంగారు రంగులోకి మారాక చక్కెర పాకంలో వేసి కాసేపు నానబెడితే జిలేబీలు సిద్ధం.

డ్రై ఫ్రూట్‌ హల్వాడేట్స్‌ ఖీర్‌బాదం బర్ఫీప్రొటీన్‌ లడ్డూచక్కెర పొంగల్‌మలై లడ్డూముంబయి కరాచీ హల్వాబాదం హల్వాశంకరపాలితిల్‌ పీఠా
Advertisement