గు(డ్డు)ట్టు చప్పుడు కాకుండా!

ABN , First Publish Date - 2020-09-20T11:10:36+05:30 IST

ఇదేంటీ... ఇన్ని గుడ్లు ఉన్నాయి? అదేంటీ.. అలా గొయ్యి తీసి పాతరేస్తున్నారు? గుడ్లుతో ఏదైనా ప్రయోగం చేస్తున్నారా? అని అనుకుంటున్నారా? అవును...

గు(డ్డు)ట్టు చప్పుడు కాకుండా!

 విజయనగరం కస్పా పాఠశాలలో దారుణం


విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 19: 

ఇదేంటీ... ఇన్ని గుడ్లు ఉన్నాయి? అదేంటీ.. అలా గొయ్యి తీసి పాతరేస్తున్నారు? గుడ్లుతో ఏదైనా ప్రయోగం చేస్తున్నారా? అని అనుకుంటున్నారా? అవును...అది ఉపాధ్యాయుల తెలివైన ‘ప్రయోగం’. ఇవన్నీ విద్యార్థులకు ఇవ్వాల్సిన గుడ్లు. మొత్తం 42 మందికి డ్రైరేషన్‌తో పాటు 2,352 గుడ్లు ఇవ్వాలని విజయనగరం జిల్లా కేంద్రంలోని కస్పా పాఠశాలకు సరఫరా చేశారు.


విద్యార్థులు రాలేదనే సాకుతో ఉపాధ్యాయులు అలాగే వదిలేశారు. దీంతో అవి కుళ్లిపోయాయి. వాటిని పాఠశాల ఆవరణలోనే శనివారం ఉదయం గొయ్యి తీసి పాతేందుకు ప్రయత్నించారు. ఈ నిర్వాకాన్ని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ బయట పెట్టింది. వెంటనే కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ స్పందించారు.


విద్యాశాఖ ఏడీఏ అరుణజ్యోతిని విచారణకు ఆదేశించారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారి జి.నాగమణి పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడారు. సొంత డబ్బులతో గుడ్లు కొనుగోలు చేసి...విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-09-20T11:10:36+05:30 IST