మోదీ నచ్చలేదని ఇమ్రాన్ ఖాన్‌కు ఓటేసిన భారతీయ క్రికెట్ ఫ్యాన్స్

ABN , First Publish Date - 2021-01-14T17:27:38+05:30 IST

ప్రపంచంలో బెస్ట్ క్రికెటర్, కెప్టెన్ ఎవరు..? ఈ ప్రశ్నపై ఐసీసీ మంగళవారం ఓ ఆన్‌లైన్ సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించింది. ఐసీసీ నిర్వహించిన పోల్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ...

మోదీ నచ్చలేదని ఇమ్రాన్ ఖాన్‌కు ఓటేసిన భారతీయ క్రికెట్ ఫ్యాన్స్

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో బెస్ట్ క్రికెటర్, కెప్టెన్ ఎవరు..? ఈ ప్రశ్నపై ఐసీసీ మంగళవారం ఓ ఆన్‌లైన్ సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించింది. ఐసీసీ నిర్వహించిన పోల్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్, న్యూజిల్యాండ్ మహిళా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్లను తన పోల్‌లో ఉంచింది. 5 లక్షల ఓట్లు వచ్చిన తరువాత పోల్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. ఈ పోల్ ఫలితాల్లో విరాట్ కోహ్లీకి 46.2 శాతం ఓటింగ్ రాగా, ఇమ్రాన్ ఖాన్‌కు 47.3 శాతం ఓటింగ్ లభించింది. ఇక డివిలియర్స్‌కు 6 శాతం, మెగ్ లానింగ్‌కు కేవలం 0.5 శాతం ఓటింగ్ మాత్రమే లభించింది. అంతా బాగానే ఉన్నా.. విరాట్ కోహ్లీ కంటే ఇమ్రాన్ ఖాన్‌కు అధికంగా ఓట్లు రావడమే ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తోంది.


ఇమ్రాన్ ఖాన్ అసలే పాకిస్తాన్ ప్రధాని.. ఆయన తలచుకుంటే సాధ్యం కానిది ఏమైనా ఉందా..? ప్రత్యేకంగా ట్విటర్ బోట్లు పెట్టి మరీ తనకు ఓటింగ్ వేయించుకున్నాడని, ట్విటర్‌ను పూర్తిగా స్పామ్ చేసి ఈ ఓట్లు తెచ్చుకుని ఉంటాడని అనుకుంటున్నారా..? అది నిజమే అయినా.. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఉంది. అదేంటంటే ఇమ్రాన్ ఖాన్‌కు భారతీయ క్రికెట్ అభిమానులు కూడా అనేకమంది ఓట్లు వేశారు. తమకు దేశ ప్రధాని మోదీ అంటే ఇష్టం లేదని, అందుకే ఇమ్రాన్ ఖాన్‌కు ఓటు వేశామని వారు బహిరంగంగా చెబుతున్నారు.


అంతేకాదు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి నిర్వహిస్తున్న ఐటీ సెల్ ‘టీం బన్’లోని కొందరు ట్విటర్ యూజర్లు కూడా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కే ఓటేసినట్లు తెలుస్తోంది. టీం బన్ సాధారణంగానే మోదీకి వ్యతిరేకంగా ఉంటుందని, ట్విటర్‌ బోట్‌లతో సోషల్ మీడియాలో వారే స్పామ్ చేసి విరాట్ కోహ్లీకి కాకుండా ఇమ్రాన్ ఖాన్‌కు ఓటేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను టీం బన్ ఖండిస్తోంది. తాము అలా చేయలేదని చెబుతోంది.



Updated Date - 2021-01-14T17:27:38+05:30 IST