భారత రాజ్యాంగాన్ని అవమానిస్తేసహించం

ABN , First Publish Date - 2022-02-05T05:24:00+05:30 IST

భారత రాజ్యాంగాన్ని ఎవరు అవమానిం చినా సహించబోమని ఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మల్లె పోగు శ్రీనివాస్‌ హెచ్చరించారు.

భారత రాజ్యాంగాన్ని అవమానిస్తేసహించం
కేసీఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

- భగ్గుమన్న దళిత, ప్రజా సంఘాల నాయకులు

- జిల్లాలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం

- క్షమాపణ చెప్పాలని నాయకుల డిమాండ్‌


పాలమూరు, ఫిబ్రవరి 4 : భారత రాజ్యాంగాన్ని ఎవరు అవమానిం చినా సహించబోమని ఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మల్లె పోగు శ్రీనివాస్‌ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీ వోస్‌ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చాలని అవహేళన చేసిన కేసీఆర్‌ దేశ ప్రజలందరికీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన జీవితాన్ని ఫణంగా పెట్టి అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించి దేశానికి అం దించారన్నారు. అనాడు మనువాదంచేత దేశంలో దళితులు, ముస్లింలు, బడుగు, బలహీన వర్గాలను బానిసలుగా చేసి మమ్మల్ని చదువుకు దూరం చేసిందన్నారు. చీకటి సమాజం నుంచి వెలుగులోకి రాజ్యాంగం తోనే వచ్చామని గర్వంగా చెబుతామన్నారు. అందరికీ ఓటుహక్కు, ప్రజా స్వామ్యంలో కల్పించిన మహానుభావుడు అంబేడ్కర్‌ అని అన్నా రు. ఆయన రచించిన రాజ్యాంగాన్నే అవమానిస్తే ఎంతటి వారి నైనా క్షమించబోమన్నారు. నాయకులు వై.నరేస్‌, జయన్న, రఘు, కృష్ణ, సాయికుమార్‌, నరేష్‌, కేశవులు, మల్లేష్‌ పాల్గొన్నారు. 


కేసీఆర్‌ వ్యాఖ్యలను ఖండించాలి


రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సమాజంలోని అందరూ ఖండించాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పత్తి యాదయ్య, యం.రాజయ్య, వి.వెంకటేష్‌; ఆర్‌.ఆంజనే యులు, చెన్నకేశవులు, జి.యాదగిరి, హనుమంతులు పాల్గొన్నారు. 


మద్దిగట్లలో సీఎం దిష్టి బొమ్మ దహనం


భూత్పూర్‌ : మండలంలోని మద్దిగట్ల గ్రామంలో శుక్రవారం బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. రాజ్యాంగాన్ని మా ర్చాలని ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చే యడాన్ని నిరసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో బీఎస్పీ నాయకులు కృష్ణకుమార్‌, తమ్మన్నగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, బీజేపీ నాయకులు రవీందర్‌రెడ్డి, నారాయణ రెడ్డి, అంబేడ్కర్‌ సఘం నాయకులు రాములు, చెన్నయ్య, వెంకటేష్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.


ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో..


బాదేపల్లి : భారత రాజ్యాం గాన్ని తిరిగి రాయాలని దొర అహంకారాన్ని ప్రదర్శించిన సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మను ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో శుక్ర వారం పట్టణంలోని అంబేడ్క ర్‌ విగ్రహం ముందు దహనం చేశారు. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ ప్రత్యే క రాష్ట్రం ఏర్పడటానికి భారత రాజ్యాంగం దోహదం చేసిన విషయాన్ని అప్పుడే మరచిపోయారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు జంగయ్య, కరాటే శ్రీను, వినోద్‌, భీంరాజ్‌, యాదయ్య, హరిబాబు, మధు, రవీందర్‌, చెన్నకేశవులు పాల్గొన్నారు. 


మిడ్జిల్‌లో...


మిడ్జిల్‌ : భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని మాట్లాడిన సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మను మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌, అంబేడ్కర్‌ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం దహనం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ  ఎంపీటీసీ గౌస్‌, నాయకులు అల్వాల్‌రెడ్డి, సంపత్‌, జహీర్‌, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షులు సరేష్‌, గణేష్‌, మల్లేష్‌, పరమేష్‌, దాసు, రాములు, నరేష్‌, రాఖీ, శంకర్‌, నాగరాజులు పాల్గొన్నారు. 






Updated Date - 2022-02-05T05:24:00+05:30 IST