ఇన్సూరెన్సు ప్రభుత్వమే చెల్లించాలి

ABN , First Publish Date - 2022-01-25T05:05:50+05:30 IST

రేషన్‌ మొబైల్‌ వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని ప్రజాపంపిణీ వాహన డ్రైవర్లు కోరుతున్నారు.

ఇన్సూరెన్సు ప్రభుత్వమే చెల్లించాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ప్రజాపంపిణీ వాహన డ్రైవర్లు

బి.కోడూరు, జనవరి 24 : రేషన్‌ మొబైల్‌ వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని  ప్రజాపంపిణీ వాహన డ్రైవర్లు కోరుతున్నారు. ఆమేర కు  సోమవారం తహసీల్దార్‌కు  వారొక విన తి పత్రం అందజేశారు. ఒక సంవత్సరానికి రూ.11 వేలు కాగా ఆరు సంవత్సరాలుగా ఇన్సూరెన్స్‌ తామే కడతామని ఆనాడు ప్రభు త్వ పెద్దలు తెలిపారని తీరా చూస్తే తమ జీతంలోనే సంవత్సర ఇన్సూరెన్స్‌ రూ.11 వేలు కట్‌ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.  హమాలీకి, వాహన పెట్రోల్‌ తదితర వాటికి అయ్యే ఖర్చులు  భరించలేక ఫిబ్రవరి నెలలో మా విధులు నిర్వర్తించడం  కష్టంగా  ఉన్నదని ఉన్నతాధికారులకు తెలిజేయడం జరిగిందన్నారు  కార్యక్రమంలో  ప్రజాపంపిణీ వాహన డ్రైవ ర్లు మధు, సుబ్బరాయుడు, రాజు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T05:05:50+05:30 IST