జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలి

ABN , First Publish Date - 2020-07-14T11:36:48+05:30 IST

జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని ఎపీయూడబ్ల్యూజే డిమాండ్‌ ..

జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలి

ఏలూరు కలెక్టరేట్‌ /తాడేపల్లిగూడెం రూరల్‌ / కొవ్వూరు, జూలై 13 : జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని ఎపీయూడబ్ల్యూజే డిమాండ్‌ చేసింది. జిల్లా అధ్యక్షుడు జీవీఎస్‌ఎన్‌.రాజు ఆధ్వర్యంలో సోమవారం జేసీ వెంకటరమణా రెడ్డిని కలిసి వినతిపత్రం అం దజేశారు. తిరుపతిలో ఒక న్యూస్‌ ఛానల్‌ వీడియో జర్నలిస్టు పార్థసారథి కరోనా బారినపడి మృతిచెందారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు అందించాలని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు కరోనా భద్రతా పరిక రాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సోమ వారం మౌన దీక్ష చేశారు.


ఐజేసీ కార్యవర్గ సభ్యుడు దూసనపూడి సోమ సుందర్‌ మాట్లాడుతూ జర్నలిస్ట్‌లకు బీమా, భద్రతా కిట్‌లు అందించాలని కోరారు. కొవ్వూరు ప్రెస్‌ రిపోర్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌డీవో కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతిపత్రం అందించారు. ఎపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మురళీకృష్ణంరాజు, ఆలపాటి మురళి, తాడేపల్లిగూడెం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష్య, కార్యదర్శులు చిక్కాల రామకృష్ణ, రవికిరణ్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా అధ్యక్షుడు తమ్మిశెట్టి సురేష్‌, కొవ్వూరు ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు జి.వీరవెంకట సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు గంధం బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T11:36:48+05:30 IST