‘కేటీపీపీ’కి రూ.6921 కోట్లతో బీమా

ABN , First Publish Date - 2021-05-19T09:24:05+05:30 IST

మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని థర్మల్‌ ప్లాంట్లకు బీమా చేయించాలని జెన్‌కో నిర్ణయించింది.

‘కేటీపీపీ’కి రూ.6921 కోట్లతో బీమా

టెండర్లు పిలిచిన జెన్‌కో

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని థర్మల్‌ ప్లాంట్లకు బీమా చేయించాలని జెన్‌కో నిర్ణయించింది. భూపాలపల్లిలో కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(కేటీపీపీ) తొలిదశలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్‌, రెండో దశలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు జెన్‌కోకు ఉన్నాయి. ఈ యూనిట్లకు పూర్తిస్థాయిలో బీమా కల్పించాలని జెన్‌కో సంకల్పించింది. ఈ రెండు ప్లాంట్లకు కలిపి అన్ని రకాల ప్రమాదాలకు రక్షణ కల్పించేలా రూ.6921 కోట్లతో బీమా చేయించనున్నారు. బిడ్ల దాఖలు గడువు ఈనెల 21 ఉదయం 10:30 గంటలకు ముగియనుంది. సాంకేతిక బిడ్లను అదే రోజు ఉదయం 11 గంటలకు తెరవనున్నారు.

Updated Date - 2021-05-19T09:24:05+05:30 IST