Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లా సమగ్రాభివృద్ధికి ఉధృత పోరాటాలు

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌

బద్వేలు, నవంబరు 28: బీజేపీ ప్రభు త్వం దేశాన్ని అమ్మకానికి పెట్టే విధంగా ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కార్పొరేటర్లకు అమ్మకానికి పెట్టిందన్నారు. బద్వే లు పట్టణం లోని ఓ కల్యాణ మండపంలో నిర్వ హించిన సీపీఎం జిల్లా మహాసభలు రెండో రోజైన ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎ.గఫూర్‌ మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంపన్న వర్గాలు, కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతున్నాయన్నారు. ఇవాళ దేశంలో పెట్రోలు, డీజల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచి సామాన్య, పేద, మధ్య తరగతివారిపై తీవ్రమైన భారాలు మోపారని ఆయన తెలిపారు. కరోనా సమయంలో దేశ ప్రజానీకాన్ని బీజేపీ గాలికొదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీలు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కడప ఉక్కుఫ్యాక్టరీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకాన్ని మో సంచేస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైందని, జిల్లాలో తుఫాను వరదలతో జనం తీవ్ర అవస్థలు పడుతుంటే వారిని ఆదుకోవడంలో వైసీపీ ప్రభు త్వం ఘోరంగా విఫలమైందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికోసం భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మనోహర్‌, శివకుమార్‌, రామ్మోహన్‌, బద్వేలు పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, చాంద్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement