Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయనగరంపై గులాబ్ తుఫాన్ తీవ్రత

విజయనగరం: గులాబ్ తుఫాన్ తీవ్రత విజయనగరం జిల్లాపై ప్రమాదకర స్థాయిలో ఉంటుందని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. జిల్లాలో కమ్యూనికేషన్, రోడ్లు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. పెనుగాలులకు పూరిళ్లు ఎగిరిపోవచ్చన్నారు. ఇళ్ల నుండి బయటకు ఆదివారం మధ్యాహ్నం రాకూడదని ప్రజలను కలెక్టర్ సూర్యకుమారి హెచ్చరించారు.   ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు ప్రమాదం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముంది. ఈ తుపానుకు పాకిస్థాన్‌ పెట్టిన ‘గులాబ్‌’ అనే పేరును ఖరారుచేసే అవకాశాలున్నాయి. నిజానికి  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం వాయుగుండంగా మారింది. సాయంత్రం 5.30 గంటలకు తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. గోపాలపుర్‌కు ఆగ్నేయంగా 670 కి.మీ దూరంలో, కళింగపట్నానికి తూర్పుగా 740 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. శనివారం ఉదయానికి తుపానుగా మారొచ్చు. దీనితో ఈ నెల 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement