క్రయ విక్రయాల జోరు

ABN , First Publish Date - 2022-01-18T04:28:36+05:30 IST

నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రభుత్వం విధించిన టార్గెట్‌ను అధిగమించే దిశగా ముందుకు సాగుతోంది.

క్రయ విక్రయాల జోరు
పేట మార్కెట్‌లో ధాన్యం కాంట చేస్తున్న దృశ్యం

- లక్ష్యం దిశగా వ్యవసాయ మార్కెట్‌

- మద్దతు ధరతో ధాన్యం విక్రయాలపై రైతుల ఆసక్తి

- మార్కెట్‌ ఆదాయం పెంపుపై పాలకవర్గం దృష్టి

నారాయణపేట, జనవరి 17 : నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రభుత్వం విధించిన టార్గెట్‌ను అధిగమించే దిశగా ముందుకు సాగుతోంది. మార్కెట్‌ కమిటీ పాలక వర్గం రైతులకు వ్యాపారుల నుంచి మద్ధతు ధర లభించే విధంగా ప్రత్యేక దృష్టి సారించడంతో ధాన్యం క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, కంది,  త్తి, జొన్నలను రైతులు పండించి విక్రయి స్తుండడంతో వ్యవసాయ మార్కెట్‌కు ఆదాయం కలిసి వస్తోంది. ప్రభుత్వం వరి కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా మార్కె ట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు నేరుగా ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించి విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తు న్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.28 కోట్ల లక్ష్యం ఉండగా డిసెంబరు నాటికి రూ.1.72 కోట్ల లక్ష్యం సాధించారు. మార్చి నెలాఖరులోపు మిగతా లక్ష్యాన్ని అధిగమించడం జరుగుతోందని పాలక చైర్‌ పర్సన్‌ భాస్కర కుమారి, వైస్‌ చైర్మన్‌ కన్న జగదీశ్‌, కార్యదర్శి చంద్రశేఖర్‌, సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా పత్తి పంట ద్వారా మార్కెట్‌కు ఒక్కశాతం రూ.80 లక్షల వరకు జిన్నింగ్‌ మిల్లుల ద్వారా ఆదాయం సమకూరింది. వరి ద్వారా రూ.40 లక్షలు, కందుల ద్వారా రూ.30 లక్షలు కమిషన్‌ రూపేనా మార్కెట్‌కు ఆదాయం కలిసివస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1.59 కోట్లు లక్ష్యం ఉండగా రూ.1.97 కోట్ల ఆదాయం మార్కెట్‌కు చేకూరి లక్ష్యాన్ని అధిగమించారు. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1.05 కోట్ల లక్ష్యం ఉండగా రూ.1.23 కోట్ల ఆదాయంతో లక్ష్యాన్ని అధిగమించారు. కాగా మార్కెట్‌ ఆదాయం పెంపు కోసం పాలక యంత్రాం గం చేపడుతోన్న చర్యలు సత్ఫలితాలను ఇస్తోంది.





Updated Date - 2022-01-18T04:28:36+05:30 IST