విద్యార్థులకు అగ్ని‘పరీక్ష’

ABN , First Publish Date - 2021-10-04T05:19:03+05:30 IST

విద్యార్థులకు అగ్ని‘పరీక్ష’

విద్యార్థులకు అగ్ని‘పరీక్ష’

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలతో పరేషాన్‌ 

ఆరు నెలల తర్వాత పరీక్షలతో ఇబ్బంది

గ్రామీణ, గురుకుల విద్యార్థులకు తీవ్ర నష్టం

25 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు


వరంగల్‌ సిటీ, అక్టోబరు 3: కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప రీక్షలను  రద్దు చేసి విద్యార్థులందరిని ప్రమోట్‌ చేసింది. పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని చేసిన అప్పటి ప్రకటన మేరకు బోర్డు ఈనెల 25 నుంచి ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అయింది. ఆన్‌లైన్‌ క్లాసులతో అరకొరగా చదివిన సిలబస్‌ ఆరు నెలల గ్యాప్‌ తర్వాత పరీక్ష ఎలా రాయాలో అర్థం కావడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతు న్నారు. మౌలిక వసతులు లేని గ్రామీణ ప్రాంత విద్యా ర్థులతోపాటు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది అగ్ని పరీక్షగా మారింది. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌, టీవి సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. అంతంత మాత్రంగా చదవడం, ఆరునెలల తర్వాత పరీక్షలు పెట్టడంపై తల్లిదండ్రులు సైతం ఆందోళన వెలిబు చ్చుతున్నారు. విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా పరీ క్షలు నిర్వహించాలని ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం నాయకులు కోరుతున్నారు. 


గురుకుల విద్యార్థులకు తప్పని తిప్పలు...

కరోనా ప్రభావంతో గురుకుల కళాశాలల విద్యార్థు లు చదువుకు దూరమయ్యారు. గురుకుల కళాశాలల్లో చదువుకునే వారందరూ పేద విద్యార్థులే కావడంతో ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు మౌలిక వసతులు లేక నష్టపోయారు. ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు వినకపోవడం, సెప్టెంబరు 1 నుంచి మొదలైన ప్రత్యక్ష తరగతులకు సైతం దూరంగానే ఉంటున్నారు. దీంతో తాము తీవ్రం గా నష్టపోతామని విద్యార్థులు వాపోతున్నారు.  


ప్రైవేట్‌, కొన్ని ప్రభుత్వం కళాశాలల్లో..

పైవేటు కళాశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌లో కొంత మేరకు తరగతులు విన్నారు. బోర్డు నుంచి పరీక్ష ప్రకటన వెలువడిన నాటి నుంచి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సెకండ్‌ ఇయర్‌ పాఠ్యాం శాలను ఆపివేసి ఫస్ట్‌ ఇయర్‌ పాఠ్యాంశాలను పునశ్చర ణ చేస్తున్నారు. దీంతో వారికి కాస్త ఊరట లభించినట్ట యింది. అలాగే, హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వరంగల్‌లోని కృష్ణకాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలల్లో ఇయర్‌ సిలబస్‌ను రివిజన్‌ చేస్తున్నారు. 


పరీక్షలతో కాలయాపన...

ఈనెల 25 నుంచి నిర్వహించనున్న పరీక్షలతో వి ద్యార్థుల సమయం వృథా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్‌ ఇయర్‌ సిలబస్‌ పూర్తి చే సేందుకు ఈ పరీక్షలు అడ్డంకిగా మారుతాయని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల సమ యం పరీక్షల కారణంగా విద్యార్థులు కోల్పోవాల్సి వ స్తుందని అభిప్రాయపడుతున్నారు. గతంలోనే ఈ పరీ క్షలకు విడతల వారిగా నిర్వహించి ఉంటే బాగుం డేదంటున్నారు. 


విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా చూడాలి.. : ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ అధ్యాపకుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు

విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా బోర్డు పరీక్షలు నిర్వహించాలి. 70 శాతం సిలబ స్‌లో 50శాతం చాయిస్‌ ఉండేలా సరళంగా నిర్వహించాలి. మౌలిక వసతులు లేని కారణంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాని విద్యార్థులతోపాటు గురుకుల విద్యార్థుల కు న్యాయం జరిగే విధంగా మూల్యాంకనం ఉండాలి. ప్రస్తుతం కొంతమంది విద్యార్థు లు ప్రత్యక్ష తరగతులకు హాజరుకాలేక పోతున్నారు. వసతుల లేమి కారణంగా కొంత మంది విద్యార్థులు పరీక్ష ల్లో తప్పే ప్రమాదం ఉంది. వారందరిని ఉత్తీర్ణులను చేయాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది.

Updated Date - 2021-10-04T05:19:03+05:30 IST