విద్యార్థినులు క్రీడల్లోనూ రాణించాలి

ABN , First Publish Date - 2021-12-08T05:26:43+05:30 IST

విద్యార్థినులు చదువుతో పాటు క్రీడ ల్లో కూడా రాణించాలని ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు అన్నారు.

విద్యార్థినులు క్రీడల్లోనూ రాణించాలి
పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వాసుబాబు

ఉంగుటూరు, డిసెంబరు 7: విద్యార్థినులు చదువుతో పాటు క్రీడ ల్లో కూడా రాణించాలని ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు అన్నారు. నారాయణపురం అరవంద శత జ యంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (చింతలపాటి బాపిరాజు స్టేడియం)లో నన్నయ విశ్వవిద్యాలయ  మహిళల అంతర కళాశాలల వాలీబాల్‌ టోర్నమెంటు, విశ్వ విద్యాలయ జట్టు ఎంపిక పోటీలు మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ పోటీలలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొన్నాయి. కళాశాల స్పెషల్‌ ఆఫీసర్‌ గిరిబాబు, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ కొండా రవి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, మరడ రమావతి, యెలిశెట్టి పాపా రావు బాబ్జి, మరడ మంగారావు, జూనియర్‌ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ బి.శ్రీనివాస్‌, అభివృద్ధి కమిటీ సభ్యులు ఈపూరి సత్యనారాయణ, బొమ్మిడి అప్పారావు పాల్గొన్నారు.


తొలి రోజు విజేతలు..


వాలీబాల్‌ పోటీలలో తొలిరోజు ఏలూరు సీఆర్‌ఆర్‌ జట్టు పై కాకినాడ ఏఎస్‌డి. కళాశాల జట్టు విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో జీడీసీ నిడదవోలు జట్టుపై ఎస్‌కేఆర్‌ రాజమహేంద్రవరం కళాశాల జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌ లో డీఎన్‌ఆర్‌ జట్ట్టుపై తణుకు ఎస్‌కేఎస్‌డీ జట్టు విజయం సాధించింది. అనంతరం జరిగిన మ్యాచ్‌లో రాజమహేంద్రవరం మహిళా  కళాశాల జట్టుపై జంగారెడ్డిగూ డెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించినట్లు ఆర్గనైజింగ్‌ కార్యదర్శి, కళాశాల పీడీ రాజా మారిసన్‌ ప్రకటించారు.

Updated Date - 2021-12-08T05:26:43+05:30 IST