ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-18T10:23:31+05:30 IST

జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సం పబ్లిక్‌ పరీక్షల జవాబు

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

ఒంగోలు విద్య, మే 17 : జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సం పబ్లిక్‌ పరీక్షల జవాబుప త్రాల మూల్యాంకనం ఆదివారం ప్రారంభ మైంది. తొలిరోజు మూల్యాంకనానికి 555 మం ది అధ్యాపకులు రావాల్సి ఉండగా 420 మంది హాజరైనట్లు జిల్లా క్యాంపు అధికారి ఆర్‌ఐవో వీవీ.సుబ్బారావు తెలిపారు. ఒంగోలులోని ఏకే వీకే, మార్కాపురంలోని సాధన, కందుకూరు లోని గాయిత్రీ, పొదిలిలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల్లో మూల్యాంకనం మొదలైంది. కరోనా జాగ్రత్త చర్యల్లో భాగంగా అధ్యాపకుల కు మాస్కులు, శానిటైజర్లు అందించడంతో పాటు భౌతికదూరం పాటిస్తూ సీటింగ్‌ ఏర్పా టు చేసినట్లు చెప్పారు.


గతంలో మూడు, నాలుగు దశల్లో నిర్వహించే మూల్యాంకనం ఒకే దఫా నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం నుంచి ఫిజిక్సు, కెమిస్ర్టీ, బాటనీ, జువాలజీ, అ ర్ధశాస్త్రం, కామర్స్‌, హిస్టరీ, సబ్జక్టుల మూల్యాం కనం ప్రారంభిస్తున్నట్లు ఆర్‌ఐవో తెలిపారు. హిస్టరీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల అధ్యాకు లు మాత్రం ఒంగోలులోని ఏకేవీకే జూనియర్‌ కళాశాల రిపోర్టు చేయాలని. మిగిలిన సబ్జెక్టు ల అధ్యాపకులు ఎక్కడైనా హాజరుకావచ్చని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-05-18T10:23:31+05:30 IST