మే15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ABN , First Publish Date - 2021-01-27T21:33:27+05:30 IST

ఇంటర్ పరీక్షలను మే15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మే15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తాం:  మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: ఇంటర్ పరీక్షలను మే15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం 33 జిల్లాల డీఈఓలతో సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం వివరాలు వెల్లడించారు. అలాగే మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 

 

రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1న స్కూల్స్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి సబితా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,252  స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 85 శాతం స్కూళ్లు సందర్శించామని వివరించారు. వాటిని ప్రారంభించేందుకు  యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని పేర్కొన్నారు. పాఠశాలల్లో , హాస్టళ్లల్లో కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్, సానిటేషన్ ప్లానింగ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపెడతామని మంత్రి సబితా పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో సానిటైజేషన్ బాధ్యతను స్థానిక సంస్థలు చూసుకుంటాయని  మంత్రి తెలిపారు. అలాగే  విద్యార్థుల  తాగునీటి కోసం మిషన్ భగీరథ వాటర్‌ను అందిస్తామని మంత్రి సబితా పేర్కొన్నారు.



విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు 60 శాతం మంది తల్లి దండ్రులు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలు తక్షణమే అందిస్తామని మంత్రి ప్రకటించారు. యూనిఫాంలు కూడా కొత్తవి అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాలో 85 శాతం మంది విద్యార్థులు డిజిటల్ క్లాస్‌లు వింటున్నారని ఆమె తెలిపారు. 4 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.  మే15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-01-27T21:33:27+05:30 IST