అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-01-21T05:45:18+05:30 IST

పాత నేరస్థుడు నలుగురు యువకులతో కలిసి ముఠాగా ఏ ర్పడ్డారు. పగలు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ రా త్రులు దేవాలయాల్లో హుండీలను దొంగిలిస్తూ ఎ ట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఇంకొల్లు పోలీ సులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి సు మారు రూ.5లక్షల సొత్తును స్వాధీనం చేసుకు న్నారు.

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్టు
మాట్లాడుతున్న ఎస్పీ మలిక గర్గ్‌

రూ.5లక్షల సొత్తు స్వాధీనం

ఎస్పీ మలికగర్గ్‌ వెల్లడి


ఒంగోలు(క్రైం), జనవరి 20: పాత నేరస్థుడు నలుగురు యువకులతో కలిసి ముఠాగా ఏ ర్పడ్డారు. పగలు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ రా త్రులు దేవాలయాల్లో హుండీలను దొంగిలిస్తూ ఎ ట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఇంకొల్లు పోలీ సులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి సు మారు రూ.5లక్షల సొత్తును స్వాధీనం చేసుకు న్నారు. గురువారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మలికగర్గ్‌ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చి మగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వడ్డే మో షే నాయకత్యంలో ఒంగోలు నగరం ఇందిరాన గర్‌లో నివాసం ఉండే కోటా బంగారయ్య, క సుకుర్తి అభినవ్‌, కుర్రా శివశంకర్‌, పాములపాటి దుర్గాప్రసాద్‌ ఏడాది క్రితం ముఠాగా ఏర్పడి అ నేక చోరీలకు పాల్పడారు. ఈ నెల 20న ఇంకొల్లు లోని కొణికి గ్రామంలోని ఆంజనేయస్వామి సెంటర్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగు రిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద ఆటో, సీసీకెమెరా, మానిటర్‌, 56గ్రాము ల బంగారం ఆభరణాలు, రూ.1,45,000 లక్షల న గదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  నింది తులు 14 దేవాలయాల్ల చోరీలకు పాల్పడ్డారని ఎస్పీ వెల్లడించారు.


జువైనల్‌ హోంలో పరిచయం


వడ్డే మోషే ఏలూరు విశాఖపట్నంలో పలు దొంగతనాలకు పాల్పడి పోలీసులకు దొరకడంతో ఏలూరు జువైనల్‌ హోంకు తరలించారు. అక్కడే ఒంగోలుకు చెందిన కోటా బంగారయ్య పరిచ యం అయ్యాడు. 2019లో జైలు నుంచి బయిట కు వచ్చిన మోషే  ఏడాది క్రితం ఒంగోలు వ చ్చాడు. ఇక్కడ బంగారయ్యతో పాటుగా మరో ముగ్గురు యువకులతో ముఠా ఏర్పాటు చేసి అ నేక చోరీలు పాల్పడ్డారు.  గుంటూరు జిల్లా  కొత్త పేటలో దొంగతనం చేసి ఆటోలో చోరీలు చేయ డం ప్రారంభించారు. రాత్రులు ఆటోలలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ దేవాలయాలతో పాటుగా తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీల కు పాల్పడ్డారు. 


ఇంకొల్లు పోలీసులకు అభినందన 


దొంగల ముఠాను పట్టుకున్న ఇంకొల్లు సర్కిల్‌ పోలీసులను ఎస్పీ మలికగర్గ్‌ అభినందిచారు. ఈ సందర్భంగా సీఐ పి.సుబ్బారావు, ఇంకొల్లు, చినగ ంజాం, పంగులూరు ఎస్‌ఐలు ఎన్‌సీ.ప్రసాద్‌, నాగబాబు, పున్నారావు, అలాగే కానిస్టేబుళ్లు బాల చంద్ర, లక్ష్మీనారాయణ, బీవీ.రమణ, హోంగార్డ్సు ఎం.ప్రభాకర్‌, పి.బాలకోటేశ్వరరావు, ఎస్‌.శ్రీనివాస రావు, శరత్‌బాబులను అభినందించి ప్రశంసాప త్రాలను అందజేశారు. 


Updated Date - 2022-01-21T05:45:18+05:30 IST