అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2022-01-21T04:46:04+05:30 IST

కడప నగరం నభీకోట, అక్కాయపల్లె ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన ఓ అంతర్‌జిల్లా దొంగను బుధవారం రాత్రి కడపలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు.

అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి

బంగారు నగలు, రూ.18,500 నగదు స్వాధీనం 

నిందితుడి వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ 

కడప(క్రైం), జనవరి 20 : కడప నగరం నభీకోట, అక్కాయపల్లె ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన ఓ అంతర్‌జిల్లా దొంగను బుధవారం రాత్రి కడపలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం తాలూకా సీఐ నాగభూషణం, ఎస్‌ఐ హుస్సేన్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి  నిందితుడి వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన వడ్డే సుధాకర్‌ ప్రస్తుతం కడప అక్కాయపల్లెలోని శాస్త్రీనగర్‌లో నివాసం ఉంటూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది నవంబరు 23వ తేదీ నభీకోటలోని ఓ ఇంటిలోకి చొరబడి బంగారు సరుడు లాక్కొని వెళ్లాడని అలాగే అతడి భార్య కమ్మలు కూడా దొంగతనం చేసినట్లు తెలిపారు. ఎస్పీ ఆన్బురాజన్‌ ఆదేశాల మేరకు నిఘా ఉంచి తాలూకా సీఐ నాగభూషణం ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్టు చేసి రూ.1,20,000 విలువ చేసే జత కమ్మలు, బంగారు సరుడు, రూ.18,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-21T04:46:04+05:30 IST