వడ్డీ రేట్లు 1.75% తగ్గించొచ్చు

ABN , First Publish Date - 2020-03-19T07:15:40+05:30 IST

వడ్డీ రేట్లు 1.75% తగ్గించొచ్చు

వడ్డీ రేట్లు 1.75% తగ్గించొచ్చు

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఆర్‌బీఐ రెపో రేటును 1.75 శాతం వరకు తగ్గించవచ్చని ఫిచ్‌  అంచనా వేస్తోంది.  భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొనడం,. కరోనా మూలంగా మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం కావడం వంటి పరిణామాలను దీటుగా ఎదుర్కొనే విధంగా ఆర్‌బీఐ ఈ చర్య తీసుకోవచ్చునని పేర్కొం ది. అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ రేట్లను తగ్గిస్తే రెపో రేటు 3.40 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 3 శాతానికి చేరుకోనుంది. ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 4.75 శాతంగా ఉంది. 2020-21లో భారత  వాస్తవ జీడీపీలో వృద్ధి 5.4 శాతం ఉండవచ్చని తెలిపింది. 


ఏప్రిల్‌ 15 వరకు గడ్డు కాలమే

కరోనా కల్లోలం మరో నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ (బోఫా) తాజా నివేదికలో పేర్కొంది. మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు నాలుగు శాతం దాటక పోవచ్చని, ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 2.2 శాతానికి పడిపోతే సంవత్సరం మొత్తం మీద వృద్ధి రేటు 4.7 శాతం దాటకపోవచ్చని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-03-19T07:15:40+05:30 IST