ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రాయితీ

ABN , First Publish Date - 2021-01-09T06:45:35+05:30 IST

గృహ రుణాల కోసం ఎదురు చూస్తున్న ఖాతాదారులకు దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ

ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రాయితీ

మార్చి వరకు ప్రాసెసింగ్‌ చార్జీలు రద్దు


ముంబై: గృహ రుణాల కోసం ఎదురు చూస్తున్న ఖాతాదారులకు దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పండగకు ముందే తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది మార్చి వరకు గృహ రుణాలపై 30 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) వరకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా అప్పటి వరకు ప్రాసెసింగ్‌ ఫీజును కూడా రద్దు చేసింది.


ఈ వడ్డీ రాయితీ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రూ.5 కోట్ల వరకు ఉండే గృహ రుణాలకు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. సిబిల్‌ పరపతి స్కోరు ఆధారంగా ఈ రాయితీ ఇస్తారు. రూ.30 లక్షల వరకు ఉండే గృహ రుణాలపై 6.80 శాతం, అంతకు మించిన రుణాలపై 6.95 శాతం వడ్డీ వసూలు చేయనున్నట్టు తెలిపింది. 


ఆఫర్‌ ముఖ్యాంశాలు

 మహిళలకు ఇచ్చే గృహ రుణాలపై అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ

 యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసినా అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ

 ఇప్పటికే ఎస్‌బీఐ నుంచి హోమ్‌ లోన్లు తీసుకున్న ఖాతాదారులు యోనో యాప్‌ ద్వారా ప్రీ అప్రూవ్డ్‌ టాప్‌ అప్‌  హోమ్‌ లోన్లు పొందవచ్చు.


Updated Date - 2021-01-09T06:45:35+05:30 IST