చంద్రబాబును చూడాలనుంది: CM Jagan.. బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ

ABN , First Publish Date - 2021-11-18T19:10:54+05:30 IST

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గురువారం ఉదయం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

చంద్రబాబును చూడాలనుంది: CM Jagan.. బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ

అమరావతి: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గురువారం ఉదయం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కుప్పం, నెల్లూరు ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావిస్తూ.. ‘అసెంబ్లీకి చంద్రబాబును తీసుకురండి. కుప్పం ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనను చూడాలని ఉంది.’ అని అచ్చెన్నాయుడుతో అన్నారు. అందుకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గెలుపోటములు మామూలేనని, చంద్రబాబు కచ్చితంగా సభకు వస్తారని చెప్పారు. ‘అయినా బీఏసీలో ఎన్నికల గురించి ఎందుకు? మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు’ అని అచ్చెన్న కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. 


ఇక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది కూడా నాటకీయంగా జరిగింది. ఒక్కరోజే సభ పెడతామంటూ స్పీకర్ తమ్మినేని సూచించారు. అయితే చర్చించేందుకు చాలా సమస్యలు ఉన్నాయని, 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. పెద్దాయన ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు అంగీకరించకపోతే ఎలా అంటూ సీఎం జగన్ చమత్కరించారు. ప్రతిపక్షం అడిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ అంగీకరించడం ఓ చరిత్ర అంటూ ఆర్థికమంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.



Updated Date - 2021-11-18T19:10:54+05:30 IST