రూ.1.82 లక్షల కోట్ల ఆస్తిపాస్తులున్న ఈ 25 ఏళ్ల యువతి ఎవరో తెలుసా..?

ABN , First Publish Date - 2021-06-10T18:40:57+05:30 IST

ఆ యువతి మాత్రం మామూలు అమ్మాయి కాదు. పాతికేళ్లకే లక్షల కోట్లకు అధినాయకురాలు అయింది. ఏకంగా లక్షా 82వేల కోట్ల రూపాయల ఆస్తి ఆమె పేరిట ఉంది. త్వరలోనే పెళ్లికి కూడా సిద్ధమయిపోతున్న ఆ యువతి ఎవరో తెలుసా..?

రూ.1.82 లక్షల కోట్ల ఆస్తిపాస్తులున్న ఈ 25 ఏళ్ల యువతి ఎవరో తెలుసా..?

ఓ పాతికేళ్ల యువతి. మహా అయితే డిగ్రీ, పీజీ పట్టాను పుచ్చుకుని ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. లేదంటే ఏ ప్రైవేటు ఉద్యోగమో, ప్రభుత్వోద్యోగమో సంపాదించి అప్పుడే కెరీర్‌ను మొదలు పెట్టేసి ఉంటుంది. కానీ ఆ యువతి మాత్రం మామూలు అమ్మాయి కాదు. పాతికేళ్లకే లక్షల కోట్లకు అధినాయకురాలు అయింది. ఏకంగా లక్షా 82వేల కోట్ల రూపాయల ఆస్తి ఆమె పేరిట ఉంది. త్వరలోనే పెళ్లికి కూడా సిద్ధమయిపోతున్న ఆ యువతి ఎవరో తెలుసా..? అంత భారీ స్థాయిలో ఆస్తిపాస్తులు ఆమె పేరుమీద ఉన్నాయంటే ఎవరో బడా వ్యాపారవేత్త కుమార్తె అయి ఉంటుందని అందరికీ అనుమానం వచ్చే ఉంటుంది కదా. నిజమే. ఆమె ఎవరో కాదు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ముద్దుల తనయురాలు జెన్నిఫర్ గేట్స్. బిల్‌గేట్స్, మిలిడా గేట్స్ విడాకుల వ్యవహారం గురించి నెట్టింట పెద్ద చర్చే జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారి పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ గురించి కూడా నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. ఆమె ఏం చేస్తుంది.? ఆమె పేరిట ఉన్న ఆస్తిపాస్తుల విలువ ఎంత? ఆమెకు కాబోయే భర్త ఎవరు? వంటి విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనపరిచారు. 


ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించి ప్రపంచానికి షాకిచ్చారు. ‘‘మా మధ్య బాంధవ్యం గురించి చాలా ఆలోచించి, మా వివాహ బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాం’’ అంటూ ఈ జంట ప్రకటించింది. ‘‘గడిచిన 27 ఏళ్లలో మేం ముగ్గురు అద్భుతమైన పిల్లలను పెంచాం..’’ అని వారిద్దరూ రాసుకొచ్చారు. వీరి ముగ్గురు పిల్లల్లో పెద్ద కుమార్తె పేరు జెన్నిఫర్ గేట్స్. ఆమెకు సరిగ్గా పాతికేళ్ల వయసు. ఈ విడాకుల ప్రకటనపై స్పందించిన జెన్నిఫర్.. ‘‘ఈ సమయంలో నాతోపాటు కుటుంబంలో అందరి మానసిక పరిస్థితి, భావోద్వేగాలకు ఎలా అండగా నిలబడాలో ఇంకా నేర్చుకుంటున్నా. ఇలా చేయడానికి నాకంటూ కొంత స్పేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేసింది. 


జెన్నిఫర్ గేట్స్ నెట్ వర్త్ (నికర విలువ) ఎంతో తెలుసా? ఏకంగా 25 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు లక్షా 82వేల కోట్ల రూపాయలన్నమాట. బడా వ్యాపారవేత్తలకో, పెద్ద పెద్ద సెలబ్రెటీలకో ఇంత మొత్తంలో ఆస్తి ఉండటం చాలా అరుదు. కానీ అలాంటిది జెన్నిఫర్ మాత్రం పాతికేళ్లకే అంత నెట్ వర్త్‌ను సంపాదించేసింది. కాకపోతే తండ్రి మైక్రాసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైనప్పుడు మరి కుమార్తెకు కూడా ఈ మాత్రం నెట్ వర్త్ ఉంటుంది కదా.. ఇంతకీ బిల్‌గేట్స్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఏకంగా 130 బిలియన్ డాలర్లు.


ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిపాస్తులను కలిగిన జెన్నీఫర్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. సియాటెల్‌లోని లేక్‌సైడ్ హై స్కూల్లో చదువుకున్న జెన్నిఫర్.. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లింది. 2018లో అక్కడి నుంచి మానవ జీవశాస్త్రం (హ్యూమన్ బయాలజీ) సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. ఆ తర్వాత తనకు ఇష్టమైన ఇక్వస్ట్రియన్ (గుర్రపు స్వారీ చేసేవాళ్లు)గా మారడానికి శిక్షణ తీసుకోవడం కోసం ఏడాది పాటు చదువుకు బ్రేక్ ఇచ్చింది. ఆపై మౌంట్ సినాయ్‌లోని మెడిసిన్ స్కూల్‌కు వెళ్తోంది. ప్రస్తుతం ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతోంది.


గుర్రపు స్వారీ చేయడంలో జెన్నీఫర్ చాలా టాలెంటెడ్. ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె గుర్రపు స్వారీ చేస్తూన ఉంది. ఆమె ఫేవరెట్ గుర్రం పేరు అలెక్స్. గుర్రపు స్వారీతోపాటు ప్రయాణాలన్నా కూడా జెన్నిఫర్‌కు చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లు అత్యధికం తన పర్యటనలకు సంబంధించినవే ఉంటాయి. కువైట్, స్పెయిన్, ఆస్ట్రేలియా వంటి ఉత్సాహవంతమైన ప్రాంతాలెన్నో ఆమె టూర్ వేసింది.


నాయల్ నాజర్.. ఈజిప్టుకు చెందిన ఈయన మరో ఇక్వస్టియన్, షో జంపర్. షో జంపింగ్ అనేది ఒక ఒలింపిక్ క్రీడ. గుర్రాలు హర్డిల్ జంప్ చేసే బృంద క్రీడ ఇది. ప్రొఫెషనల్ షో జంపర్ అయిన నాజర్ గురించి అంతకుముందు కేవలం ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికే తెలుసు. కానీ జెన్నిఫర్‌తో నిశ్చితార్థం చేసుకోవడంతో నాజర్ ప్రపంచవ్యాప్తంగా సెలెబ్రిటీ అయిపోయారు. వీరిద్దరూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఈ నిశ్చితార్థం సమయంలో ‘‘మన మిగతా జీవితాలను నేర్చుకుంటూ, ఎదుగుతూ, నవ్వుతూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించడానికి ఎదురు చూస్తున్నా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో జెన్నిఫర్ ఒక పోస్టు పెట్టింది. 


ఎంగేజ్‌మెంట్ తర్వాతి నుంచి ఈస్ట్ కోస్ట్ ప్రాంతంతో కలిసి జీవిస్తున్న ఈ జంటకు.. ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమ. జెన్నిఫర్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తేనే ఈ విషయం తేటతెల్లమైపోతుంది. ఎందుకంటే ఆమె ఇన్‌స్టాలో ఎక్కువ శాతం ఫొటోలూ ఈ జంట అన్యోన్యంగా ఉన్నవే. అలాగే ఏర్పాటు చేసి నిర్వహించేంది జెన్నిఫరే. ఈ బృందంలో జెన్నిఫర్-నాజర్ జంట కూడా రైడర్లుగా ఉన్నారు. దానాలు చేయడంలో జెన్నిఫర్.. తన తల్లిదండ్రులను ఫాలో అవుతోంది. ‘‘నేను భారీ సౌకర్యాల నడుమ పుట్టాను. ఆ అవకాశాలను ఉపయోగించుకొని, వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ నాకు నచ్చిన అంశాలను తెలుసుకోవడం ముఖ్యం. అదే సమయంలో ఈ ప్రపంచాన్ని ఇంతకు ముందు కంటే కొంచెం మెరుగ్గా చేస్తానని ఆశిస్తున్నా’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.

Updated Date - 2021-06-10T18:40:57+05:30 IST