‘నెహ్రూ స్థానంలో ఇందిర ఉండి ఉంటే భారత్‌లో నేపాల్ విలీనమయ్యేది’

ABN , First Publish Date - 2021-01-07T00:23:29+05:30 IST

‘హిమాలయ రాజ్యం నేపాల్‌ భారత్‌లో విలీనమయ్యేందుకు ముందుకొచ్చినా.. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సున్నితంగా తిరస్కరించారు. నెహ్రూ స్థానంలో ఇందిరా గాంధీ ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ప్రస్తుతం నేపాల్ భారత్‌లో ఓ ప్రధాన నగరంగా ఉండేది’... ఈ మాటలు అన్నది ఎవరో కాదు.

‘నెహ్రూ స్థానంలో ఇందిర ఉండి ఉంటే భారత్‌లో నేపాల్ విలీనమయ్యేది’

న్యూఢిల్లీ: ‘హిమాలయ రాజ్యం నేపాల్‌ భారత్‌లో విలీనమయ్యేందుకు ముందుకొచ్చినా.. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సున్నితంగా తిరస్కరించారు. నెహ్రూ స్థానంలో ఇందిరా గాంధీ ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ప్రస్తుతం నేపాల్ భారత్‌లో ఓ ప్రధాన నగరంగా ఉండేది’... ఈ మాటలు అన్నది ఎవరో కాదు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తన ఆత్మకథలో నేపాల్ విలీన ప్రతిపాదన- నెహ్రూ తిరస్కరణ పేరిట కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పేరుతో ఆయన రాసుకున్న ఆత్మకథలో ఈ విషయం స్పష్టంగా ఉంది. 


నేపాల్ విలీన ప్రతిపాదనను మొదట నేపాల్ రాజు త్రిభువన్‌ వీర్‌ విక్రమ్‌ చేశారట. ఆయన చేసిన ప్రతిపాదనను నెహ్రూ తోసిపుచ్చారని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. నేపాల్‌ స్వతంత్ర రాజ్యమని.. అది అలాగే ఉండాలని నెహ్రూ కాంక్షించారన్నారు. ఆ సమయంలో నెహ్రూ స్థానంలో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదని, సిక్కిం తరహాలో భారత్‌లో నేపాల్‌ అంతర్భాగం అయ్యేదని చెప్పుకొచ్చారు. ‘ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ 11వ అధ్యాయంలో ‘నా ప్రధానమంత్రులు.. భిన్న శైలులు.. భిన్న దృక్పథాలు’ శీర్షికన ప్రణబ్‌ తాను పనిచేసిన ప్రధానుల గురించి వివరించారు. రాజుల పాలన పోయి నేపాల్‌లో ప్రజాస్వామ్యం రావాలని నెహ్రూ కోరుకుంటున్న సమయంలో.. ఆశ్చర్యకరంగా త్రిభువన్‌ ప్రతిపాదన వచ్చిందన్నారు. రూప పబ్లికేషన్స్‌ ప్రచురించిన ప్రణబ్‌ ఆత్మకథ మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది.

Updated Date - 2021-01-07T00:23:29+05:30 IST