Abn logo
Sep 26 2021 @ 00:00AM

ఆద్యంతం ఆసక్తిగా..

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో షర్మిల కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు

వైసీపీ నేతల్లోనూ ఆతృత 

ప్రసారం చేయని ఆపరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో షర్మిల కార్యక్రమాన్ని జిల్లాలో ని రాజకీయ ప్రముఖులు, విశ్లేషకుల నుంచి సా ధారణ ప్రజానీకం వరకూ ఆసక్తిగా వీక్షించారు. అ నేక ప్రాంతాల్లో కేబుల్‌ ఆపరేటర్లు ఏబీన్‌ ఛానల్‌ని ప్రసారం చేయకపోయినా యూ ట్యూబ్‌, ఇంటర్నె ట్‌లలో చూశారు. సాధారణ  ప్రజలతోపాటు, యా వత్తు రాజకీయ వర్గాల వారు ఈ కార్యక్రమాన్ని వీక్షించటం కనిపించింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ఇటీవల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయ టం, తన అన్న అయిన మన ముఖ్యమంత్రి జగన్‌ పై విసుర్లు విసరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ, సీనియర్‌ జ ర్నలిస్టు రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఈ విష యం గత మూడు రోజుల నుంచి వివిధ రూపా ల్లో ప్రజలకు అందించింది. దీంతో ఆదివారం రాత్రి ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ ప్రసారమవుతున్నంత సే పు సామాన్య ప్రజానీకం, ప్రత్యేకించి రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తిగా వీక్షించారు. అయితే ప్రభుత్వ ఆంక్షలతో అనేక ప్రాంతాల్లో ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేయటంతో ఆయా ప్రాంతాల్లో  ప్రజలు ఆపరేటర్లను దూషించడం, వారిపై ఆగ్ర హం వ్యక్తం చేయటం కనిపించింది. అయితే ఎ ప్పుడూ లేనివిధంగా మారుమూల గ్రామాలలో సై తం ప్రజలు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని వినియోగించు కుని ఈ కార్యక్రమాన్ని వీక్షించటం విశేషం.