వాషింగ్‌ చేస్తే సరిపోతుందా?

ABN , First Publish Date - 2020-06-17T05:58:33+05:30 IST

వర్షాకాలంలో కారు క్లీనింగ్‌ పెద్ద పనే. చిత్తడి రోడ్లపై టైర్లకు అంటుకునే మురికిని వదిలించడం అంత సులువు కాదు. ప్రతి పదిహేను రోజులకోసారైనా కారు వాష్‌ చేయించక తప్పని పరిస్థితి వస్తుంది...

వాషింగ్‌ చేస్తే సరిపోతుందా?

వర్షాకాలంలో కారు క్లీనింగ్‌ పెద్ద పనే. చిత్తడి రోడ్లపై టైర్లకు అంటుకునే మురికిని వదిలించడం అంత సులువు కాదు. ప్రతి పదిహేను రోజులకోసారైనా కారు వాష్‌ చేయించక తప్పని పరిస్థితి వస్తుంది. అయితే వాషింగ్‌ ఒక్కటే సరిపోదని, ఎక్స్‌టీరియర్స్‌తో పాటు ఇంటీరియర్స్‌ కేర్‌ కూడా తీసుకోవాలంటున్నారు ‘3ఎం కార్‌ కేర్‌’ ప్రతినిధులు. కారు క్లీనింగ్‌, డీటైలింగ్‌ ఎలా చేయాలనేదానిపై కొన్ని సూచనలు చేస్తున్నారు. 


  1. డీటైలింగ్‌ కన్నా ముందు కారును క్లీన్‌ చేయాలి. చాలామంది వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ కారుపై ఉన్న దుమ్ము కారణంగా దానిపై గీతలు పడే అవకాశాలున్నాయి. సాధారణ వస్త్రానికి బదులు మైక్రోఫైబర్‌ క్లాత్‌ ఉపయోగించడం మంచిది. 
  2. వర్షాకాలంలో ప్రతిసారి వాషింగ్‌ కోసం కారుని గ్యారేజీకి తీసుకువెళ్లక్కర్లేదు. హ్యాండ్‌ వాష్‌ కూడా సరిపోతుంది. కనీసం 10 రోజులకోమారు అయినా కారు శుభ్రం చేయాలి. మరీ కఠినమైన మురికి ఉంటే జెట్‌ వాష్‌ వాడొచ్చు.  
  3. కొంతమంది ఇళ్లలో వాడే డిష్‌ వాష్‌ క్లీనర్స్‌ కూడా కారు కడగడానికి ఉపయోగిస్తుంటారు. దానివల్ల కారు రంగు వెలసి పోయే అవకాశాలున్నాయి. కార్‌ వాష్‌ షాంపూ లేదంటే కండిషనర్‌ వాడవచ్చు.
  4. వర్షంలో తడిస్తే... కారుని ఇక క్లీన్‌ చేయక్కర్లేదనుకొంటారు కొంతమంది. అది సరికాదు. వర్షపు నీటిలో కూడా కాలుష్యం కారణంగా యాసిడ్స్‌ ఉండే అవకాశాలుంటాయి. అందువల్ల తరచుగా కారును శుభ్రం చేయడం చాలా అవసరం. 
  5. వ్యాక్సింగ్‌ చేయిస్తే, అదనపు లేయర్‌గా తోడ్పడుతుంది. యూవీ ప్రొటెక్షన్‌ ఏజెంట్స్‌తో కూడా కొన్ని వాక్స్‌ వస్తున్నాయి. దీనివల్ల ఆరుబయట నిలిపే కార్ల పెయింట్‌ త్వరగా పాడవకుండా ఉంటుంది.  
  6. ఇంటీరియర్‌ మురికిగా ఉంటే చెడు వాసన వెదజల్లుతుంది. దీంతో పాటు నిర్వహణ పరంగా సమస్యలు తెలెత్తుతాయి. ఇంటీరియర్‌ క్లీనింగ్‌ కోసం వ్యాక్యూమింగ్‌, బ్రషింగ్‌, స్టీమ్‌ క్లీనింగ్‌, గ్లాస్‌ క్లీనింగ్‌, లెదర్‌ ట్రిమ్మింగ్‌, వైపింగ్‌, పెర్‌ఫ్యూమింగ్‌ చేయడం మంచిది. 

Updated Date - 2020-06-17T05:58:33+05:30 IST