ఇంటర్‌ పరీక్షల్లో పొరపాట్లు లేకుండా చూడాలి: రాజేశం

ABN , First Publish Date - 2020-02-28T11:43:05+05:30 IST

ఇంటర్‌ పరీక్షల్లో పొరపాట్లు లేకుండా చూడాలి: రాజేశం

ఇంటర్‌ పరీక్షల్లో పొరపాట్లు లేకుండా చూడాలి: రాజేశం

జగిత్యాల అర్బన్‌, ఫిబ్రవరి 27: ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర కళాశాలలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ రాజేశం మాట్లాడుతూ ఇంటర్మీడియెట్‌ అందరూ టీనేజ్‌ విద్యార్థులు ఉంటారని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా, ప్రశాంతమైన వాతావారణంలో పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పరీక్షా కేంద్రంలో పని చేసే సిబ్బంది ఎవరూ మొబైల్స్‌ వినియోగించరాదని, నిబంధనలకు విరుద్ధంగా పని చేసే సిబ్బందిపై కఠిన చర్యలుం ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, ప్రశాతంగా పరీక్షలు రాసే విధంగా చూడాలని సిబ్బందికి దిశా నిర్ధేశం చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్లు తమ విధులు నిర్వహించాలని సూచించారు. ఇంటర్‌ నోడల్‌ అధికారి నారాయణ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సహకారంతో పరీక్షలను ఎలాంటి సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహిస్తామని, ప్రతి విద్యార్ధికి డ్యూయల్‌ డెస్క్‌పై పరీక్ష రాసే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. హాల్‌ టికెట్లపై ప్రిన్సిపాల్‌ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారని, విద్యార్థులు ఈ విషయంలో ఆందోళనకు గురి కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ నిర్వహణ సభ్యులు రమేష్‌ బాబు, డి.నాగభూషణం, ప్రిన్సిపాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి, జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు సంజీవ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-02-28T11:43:05+05:30 IST