చీలికదిశగా ఎన్డీ రాయలవర్గం ? తారస్ధాయిలో వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2021-04-18T05:24:24+05:30 IST

గత కొంతకాలంగా రెండుగ్రూపులుగా వేర్వేరుగా కార్యకలపాలు సాగిస్తున్న న్యూడెమోక్రసీ రాయలవర్గంలో తీవ్ర విబేధాలు తారస్థాయికి చేరి చీలికకు దారితీస్తున్నట్లు రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

చీలికదిశగా ఎన్డీ రాయలవర్గం ?  తారస్ధాయిలో వర్గ విభేదాలు

 వాట్సాప్‌ వేదికగా పరస్పర ఆరోపణలు

 ఇల్లెందు టౌన్‌, ఏప్రిల్‌ 17: గత కొంతకాలంగా రెండుగ్రూపులుగా వేర్వేరుగా కార్యకలపాలు సాగిస్తున్న న్యూడెమోక్రసీ రాయలవర్గంలో తీవ్ర విబేధాలు తారస్థాయికి చేరి చీలికకు దారితీస్తున్నట్లు రాజకీయపరిశీలకులు  భావిస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలతోపాటు పొరుగున ఉన్న జిల్లాల్లో న్యూడెమోక్రసీ రాయలవర్గంగా ఉన్న నేతలు ఒకవైపు రాష్ట్రనేత ఆవునూరిమధు, మరోవైపు రాయలవర్గంగా ఉన్న పోటురంగారావు, రాయలచంద్రశేఖర్‌ గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. 2014లో న్యూడెమోక్రసీగా ఆ పార్టీ రాయల, చంద్రన్నవర్గాలుగా విడిపోయింది. ఎవరు ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాల్లో వారు రాయల, చంద్రన్నవర్గాలుగా పనిచేస్తున్న క్రమంలో గతకొంతకాలంగా రాయలవర్గంలో తలెత్తిన విభేదాల మూలంగా రెండు గ్రూపులుగా పనిచేస్తున్నారు. ఒకేపార్టీ పేరుతో రెండుగ్రూపులుగా పనిచేయడంతో పాటు ఇల్లెందులోని పార్టీ కార్యాలయంలో మధు గ్రూప్‌ ఉండగా, మరో కార్యాలయం చండ్రకృష్ణమూర్తి విజ్జానకేంద్రంగా రాయలవర్గం కార్యాకలపాలు సాగిస్తోంది. అయితే శుక్రవారం గుండాల మండల కేంద్రంలో తునికాకు కట్టధరల విషయంమై తునికాకు కాంట్రాక్టర్లతో జరిగిన చర్చల్లో రెండు గ్రూపులనుంచి ఆవునూరి మధు, రాయల చంద్రశేఖర్‌లతో పాటు వారి అనుచరులు పాల్గొన్నారు. చర్చల్లో తునికాకు కట్టధరను పెంచేందుకు నిర్ణయం జరిగిన అనంతరం రెండు గ్రూపులకు చెందిన నేతల నడుమ వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగినట్లు తెలిసింది. ఈ గొడవ తరువాత న్యూమోక్రసీ వరంగల్‌ ఏజెన్సీ ప్రాంత రీజినల్‌కమిటీ కార్యదర్శి  బండారి ఐలయ్య పేరుతో వాట్పాఫ్‌ గ్రూపుల్లో రాయల చంద్రశేఖర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ పొస్టింగులు పెట్టారు. కేంద్ర కమిటీ తిరస్కరించిన రాయలచంద్రశేఖర్‌ ఏజెన్సీ ఉద్యమంలో జోక్యం చేసుకుంటూ పార్టీ విచ్చినానికి పాల్పడుతున్నాడని, గ్రామాల్లోకి రాయలచంద్రశేఖర్‌ వస్తే తరమివేయాలని పిలుపునిచ్చారు. అయితే అంతే ఘూటుగా స్పందించిన రాయలవర్గం నాయకులు ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఒక రాష్ట్రస్థాయి నేతను టార్గెట్‌ చేస్తూ ప్రతివిమర్శలు చేశారు. రాయలవర్గం నాయకుడిగా ఉన్న నాయినిరాజు నేతృత్యంలో రాష్ట్ర నేతతోపాటు అతడి కుమారిడిపై తీవ్రంగానే విమర్శలు గుప్పించారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శులు చేస్తూనే వరంగల్‌ రీజినల్‌ కార్యదర్శి బండారి ఐలయ్య పేరుతో రాయల చంద్రశేఖర్‌పై పత్రికా ప్రకటలు సైతం ఇచ్చారు. అదేవిధంగా శనివారం ఇల్లెందులో రాయలవర్గం రాష్ట్ర నాయకులు చినచంద్రన్న, చండ్రఅరుణలు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రనాయకులు రాయలచంద్రశేఖర్‌ ఏజెన్సీ ప్రాంత నాయకుల పిలుపుమేరకు తునికాకు చర్చల్లో పాల్గొన్నాడని వివరించారు. అయితే ఒకరిపై ఒకరు బహిరంగంగా ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కడంతో న్యూడెమోక్రసీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితి మరో చీలికకు దారితీసే ప్రమాదం ఉందని ఎన్‌డీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 


Updated Date - 2021-04-18T05:24:24+05:30 IST