ఓటీఎస్‌ వసూళ్ల కోసం అంతర్గత రుణాలు

ABN , First Publish Date - 2022-01-18T03:57:32+05:30 IST

ఇందిర క్రాంతి పథం జిల్లా, మండల స్థాయి అధికారులు ఓటీఎస్‌ నగదు వసూళ్ల కోసం ఆఖరికి పొదుపులో అంతర్గత రుణాలకు ఒప్పించి అర్హులకు ఇప్పించాలని ఆదేశిస్తున్నారు.

ఓటీఎస్‌ వసూళ్ల కోసం అంతర్గత రుణాలు
ఇందిర క్రాంతి పథం వెలుగు కార్యాలయంలో ఏపీఎం, సీసీలతో ఓటీఎస్‌ వసూళ్లపై కసరత్తు చేస్తున్న మండల ప్రత్యేకాధికారి

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 17: ఇందిర క్రాంతి పథం జిల్లా, మండల స్థాయి అధికారులు ఓటీఎస్‌ నగదు వసూళ్ల కోసం ఆఖరికి పొదుపులో అంతర్గత రుణాలకు ఒప్పించి అర్హులకు ఇప్పించాలని ఆదేశిస్తున్నారు.  బుచ్చిరెడ్డిపాళెం, మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్‌ను సాధించాల్సిందేనని మండల ప్రత్యేకాధికారి సుధాకర్‌ సోమవారం ఇందిర క్రాంతిపథం ఏపీఎం లలిత, ,సీసీలకు ఖరాఖండీగా చెప్పేశారు.. ఓటీఎస్‌ వసూళ్లలో మీరు ఏం చేస్తారో మాకు తెలీదు టార్టెట్‌ను రీచ్‌ కావాల్సిందేనని తెగేసి చెప్తున్నారు. టార్గెట్‌ను పూర్తి చేసి అధికారులకు మంచి పేరు తీసుకురావాలి అనడం కొసమెరుపు.

నీటి పోరంబోకు స్థలాల్లో ఇళ్లకూ వసూళ్లు

ప్రభుత్వ నీటి పోరంబోకు స్థలాల్లో నిర్మించిన ఇళ్లకు ఓటీఎస్‌ వసూళ్లను మినహాయించింది. అలాంటి వాటికి రిజిస్ర్టేషన్లు చేయడానికిలేదని తేల్చేసింది. అయితే మండలంలోని పలు గ్రామాల్లో ఈ తరహా పోరంబోకు భూముల్లో నిర్మించిన ఇళ్లకు కూడా వసూలు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-18T03:57:32+05:30 IST