ఆలయంలో అంతర్గత బదిలీలు

ABN , First Publish Date - 2020-09-19T10:07:03+05:30 IST

మహానంది దేవస్థానంలో 18 మంది రెగ్యులర్‌, ఏజెన్సీ సిబ్బందిని అంతర్గతంగా బదిలీ చేసినట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. డీసీబీ సెక్ష

ఆలయంలో అంతర్గత బదిలీలు

మహానంది, సెప్టెంబరు 18: మహానంది దేవస్థానంలో 18 మంది రెగ్యులర్‌, ఏజెన్సీ సిబ్బందిని అంతర్గతంగా బదిలీ చేసినట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. డీసీబీ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ హరినాథ్‌ను టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉదయం, మధ్యాహ్నం షిప్ట్‌ల్లో విధులు నిర్వహించేలా మార్పు  చేశారు. ఆయన స్థానంలో రికార్డు అసిస్టెంట్‌ సురేంద్రనాథ్‌ రెడ్డిని నియమించారు.


విశ్రాంతి గదుల ఇన్‌చార్జిగా ఆర్‌ఎస్‌ శ్రీనివాసులు, శానిటేషన్‌ ఇన్‌చార్జిగా లక్ష్మయ్య, బుకింగ్‌ కౌంటర్‌కు ఈశ్వరయ్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా మదన్‌ కుమార్‌ను నియమించారు. శివాలయం వద్ద హుండీల పర్యవేక్షణ బాధ్యతలను కర్ణా బహదూర్‌, డీపీ శివకుమార్‌కు అప్పగించారు. కామేశ్వరిదేవి ఆలయం హుండీ వద్ద జీఎం రవికాంత్‌ విధులు నిర్వహిస్తారు.


క్లోక్‌ రూం నిర్వహణ బాధ్యతలను అంకి నాగరాజుకు అప్పగించారు. ఏజన్సీ ఉద్యోగులను ఆలయంలో వివిధ కౌంటర్లకు బదిలీ చేశారు. తక్షణమే బదిలీ అయున స్థానాల్లో బాధ్యతలు తీసుకోవాలని ఉద్యోగులకు ఈవో ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-09-19T10:07:03+05:30 IST