Abn logo
Sep 25 2021 @ 09:04AM

అంతర్జాతీయ పోటీలకు బాడీబిల్డర్‌ మణికంఠన్‌

చెన్నై: త్వరలో ఉబ్జెకిస్తాన్‌లో జరుగనున్న డబ్ల్యూబీపీఎఫ్‌ వరల్డ్‌ బాడీబిల్డింగ్‌ ఫిజిక్‌ స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నగరానికి చెందిన బాడీ బిల్డర్‌, ప్రపంచ టైటిల్‌ విజేత ఆర్‌. మణికంఠన్‌ పాల్గొననున్నారు. వృత్తిరీత్యా ఫిట్‌నెస్‌ నిపుణుడైన మణికంఠన్‌.. ఇప్పటికే రెండుమార్లు మిస్టర్‌ వరల్డ్‌ చాంఫియన్‌ షిప్‌ సాధించారు. టోనీస్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌, వెల్నెస్‌ సంస్థల వ్యవస్థాపకుడైన ఆయన.. 165 సెంటీమీటర్ల ఎత్తు కేటగిరీలో పోటీ పడనున్నారు. ఆయన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం వరుసగా ఇది మూడోసారి. ఈ సందర్భంగా మణికంఠన్‌ విలేఖరులతో మాట్లాడుతూ.. అక్టోబరు 1 నుంచి 7వ తేదీ వరకు ఉబ్జెకిస్తాన్‌లోని తాష్కెంట్‌ నగరంలో పోటీలు జరుగనున్నాయని తెలిపారు. అంతర్జాతీయ పోటీలకు దేశం నుంచి మూడోమారు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా వుందన్నారు. తాను మరోమారు ప్రపంచ విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.