Abn logo
Nov 26 2021 @ 03:38AM

ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడిగా వివాదాస్పద అధికారి

  • అహ్మద్‌ నాసెర్‌ అల్‌-రయీసీని ఎన్నుకున్న వైనం
  • ఆసియా కార్యనిర్వాహక కమిటీ ప్రతినిధిగా ప్రవీణ్‌ సిన్హా 


ఇస్తాంబుల్‌, నవంబరు 25: ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌(ఇంటర్‌పోల్‌) కొత్త అధ్యక్షుడిగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కు చెందిన వివాదాస్పద అధికారి మేజర్‌ జనరల్‌ అహ్మద్‌ నాసెర్‌ అల్‌-రయీసీ ఎన్నికయ్యారు. ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ నాసెర్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్ష పదవిలో అహ్మద్‌ నాసెర్‌ నాలుగేళ్లు కొనసాగుతారు. గతంలో ఆయన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఆయనపై ఫ్రాన్స్‌ సహా 5 దేశాల్లో క్రిమినల్‌ కేసులున్నాయి. మరోవైపు ఇంటర్‌పోల్‌ ఆసియా కార్యనిర్వాహక కమిటీ ప్రతినిధిగా భారతీయ అధికారి ఎన్నికయ్యా రు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ ప్రవీణ్‌ సిన్హాను ఇంటర్‌పోల్‌ ఎన్నుకుంది. కాగా, యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి సభ్య దేశంగా భారత్‌ గురువారం ఎన్నికైంది. ఈ కమిటీలో మొత్తం 21 దేశాలు ఉంటాయి. ఆ కమిటీలో సభ్య దేశంగా భారత్‌ నాలుగేళ్ల పాటు ఉండనుంది.