Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

  1. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ
  2. ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం


నంద్యాల, డిసెంబరు 3: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల డివిజన్‌ దివ్యాంగుల సంక్షేమ సం ఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ గుర్రాల రవికృష్ణ అన్నారు. శుక్రవారం అంతర్జా తీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్‌ దివ్యాంగుల సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వంద మంది దివ్యాంగులకు డాక్టర్‌ రవికృష్ణ, ఆర్థో వైద్యుడు డాక్టర్‌ మాధవరెడ్డి, ఈఎన్‌టీ వైద్యుడు డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ వెంకటేశ్వర్లు సౌజన్యంతో దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ అనిల్‌కుమార్‌, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌, కార్యదర్శి మజార్‌ ఆలీ, న్యాయవాది శ్రీదేవి, దివ్యాంగుల సంఘం నాయకులు సుబ్బారెడ్డి, చలపతి, రమణయ్య, హానీ్‌ఫఖాన్‌, మధు, జిలాని పాల్గొన్నారు. 


పాణ్యం: స్థానిక ఎంఆర్‌సీ కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎంఈవో కోటయ్య హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల జీవన నైపుణ్యం పెంచేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అనంతం దివ్యాంగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జిలానీబాషా, పాఠశాల  కమిటీ చైర్మన్‌ కవిత, ఐఈఆర్టీలు సంపూర్ణరావు, శివసాయిప్రసాద్‌,  సీఆర్పీలు పాల్గొన్నారు.


రుద్రవరం: దివ్యాంగ విద్యార్థులను సమ దృష్టితో చూడాలని ఐఈఆర్టీ టీచర్‌ ఖాదర్‌బాషా అన్నారు. శుక్రవారం రుద్రవరం భవిత కేంద్రంలో అంత ర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేశారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో విజయ్‌కుమార్‌, శేఖర్‌, సీఆర్పీ రామయ్య పాల్గొన్నారు. 


దొర్నిపాడు: మండలంలోని దొర్నిపాడు భవిత కేంద్రంలో ఐఈఆర్టీఎస్‌ రాజేశ్వరి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఎమ్మార్సీ సిబ్బంది జావిద్‌, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. 


చాగలమర్రి: దివ్యాంగ విద్యార్థులు ఆత్మస్థైరం పెంచుకోవాలని  హెచ్‌ఎం కోటయ్య అన్నారు. శుక్రవారం చాగలమర్రి బాలుర ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ ఉపాధ్యాయులు విజయ్‌కుమార్‌, రవింద్రారెడ్డి, శ్రీనివాసులు,  మహబూబ్‌బాషా, బుర్రాన్‌దిన్‌, పీడీ దాదాపీర్‌ పాల్గొన్నారు. 


ఉయ్యాలవాడ: దివ్యాంగులు నిరుత్సాహ పడకుండా మనోధైౖర్యంతో ముం దుకెళ్లాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాబుపీరా సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఐఈఆర్టీ ఉపాధ్యాయులు రియాజ్‌, రఘురామిరెడ్డి, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.Advertisement
Advertisement