బాదములతో, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం వేడుక చేయండి

ABN , First Publish Date - 2021-05-16T05:36:32+05:30 IST

ప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. ఈ రోజున కుటుంబాల ప్రాధాన్యతను వేడుక చేయడంతో పాటుగా ..

బాదములతో, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం వేడుక చేయండి

ప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. ఈ రోజున కుటుంబాల ప్రాధాన్యతను వేడుక చేయడంతో పాటుగా కుటుంబాలకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన మెరుగుపరచడం చేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సంక్షేమంపై నూతన సాంకేతికతల ప్రభావం అనే అంశంగా ఎంచుకున్నారు.అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ సందర్భంలో కుటుంబాల ఆరోగ్యం, సంక్షేమం కోసం తోడ్పాటునందించాల్సిన ఆవశ్యకత ఉందని, దానితో పాటుగా స్వీయ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాల్సి ఉందని నిర్వహణ కర్తలు సూచిస్తున్నారు. 


దీనికోసం జీవనశైలిలో అతి చిన్నవే అయినప్పటికీ ప్రభావవంతమైన మార్పులు చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య పరంగా మార్పులను తీసుకురావాల్సి ఉందని, ఈ క్రమంలోనే ఈ ఏడాది పోషకాహారంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా సరైన స్నాకింగ్‌ తీసుకోడం. బాదములు లాంటి గింజలలో 15 రకాల పోషకాలు అయినటువంటి విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌,జింక్‌ మొదలైనవి ఉంటాయి. ఇవి గాక బాదములలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందువల్ల వీటిని తీసుకోవాలని నిపుణులు సూచించారు.

Updated Date - 2021-05-16T05:36:32+05:30 IST