Abn logo
Sep 22 2021 @ 10:00AM

‘క్లోజప్’ షాట్‌ ఉదంతం: జోహన్నా ఫార్బర్‌కు క్షమాపణలు

మాస్కో: రష్యాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగిన సమయంలో అవమానానికి గురైన ప్రముఖ ఆస్ట్రియన్ పర్వతారోహకురాలు జోహన్నా ఫార్బెర్... తాజాగా స్పోర్ట్స్ క్లైంబింగ్ గవర్నింగ్ బాడీ నుంచి క్షమాపణలు అందుకున్నారు. ఆమె శరీరంలోని దిగువ భాగానికి సంబంధించిన 'క్లోజప్' షాట్‌లు ప్రసారమైన నేపథ్యంలో ఆమె నిరసన వ్యక్తం చేశారు. గత వారంలో బౌల్డర్ సెమీ-ఫైనల్ సమయంలో ఆస్ట్రియన్ బ్రాడ్‌కాస్టర్ ఈవెంట్‌లో  ఫార్బర్ దిగువ భాగాన్ని క్లోజప్ రీప్లే ప్రసారం చేశారు. ఈ పర్వతారోహకురాలు తన ఈవెంట్‌లో ఈ విధమైన కవరేజ్‌కు గురవడం ఇది రెండవసారి.

ఈ సంఘటన తర్వాత ఆమె 'క్రీడల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టండి... వారి ప్రతిభను ప్రశంసించండి' అంటూ గత జూన్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో తాజాగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లైంబింగ్... అథ్లెట్లతోపాటు స్పోర్ట్ క్లైంబింగ్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పింది. అలాగే ఇటువంటి అభ్యంతరకర ఫొటోలు, వీడియోల ప్రసారాన్ని నిరోధించడానికి, అథ్లెట్ల గౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది. పర్వతారోహకురాలు జోహన్నా ఫార్బెర్‌కు ఎదురైన ఈ ఘటన జూన్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో చోటుచేసుకుంది. అప్పట్లో ఆమెకు సంబంధించిన స్లో మోషన్ సీక్వెన్స్‌ని ప్రసారం చేశారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘటన తనను దారుణమైన మానసిక వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. జాతీయ టెలివిజన్‌తో పాటు సోషల్ మీడియాలో వేలాది మంది వీక్షలు తన స్లో-మోషన్‌ వీడియోను చూడటం తనకు ఎంతో ఇబ్బంది కలిగించిందని ఆ పోస్టులో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption