అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని పొడగించిన కేంద్రం

ABN , First Publish Date - 2020-03-27T00:43:00+05:30 IST

అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని కేంద్రం గురువారం పొడగించింది.

అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని పొడగించిన కేంద్రం

న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని కేంద్రం గురువారం పొడగించింది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడగిస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. గత వారం విధించిన వారం రోజుల నిషేధాన్ని ఏప్రిల్ 14 వరకు పొడగించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు దేశీయ విమానాలపై మార్చి 31 వరకు నిషేధం విధించిన విషయం విదితమే. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. 

Updated Date - 2020-03-27T00:43:00+05:30 IST