అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదీ..

ABN , First Publish Date - 2021-07-31T04:47:01+05:30 IST

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన స్వరీసుల రద్దు గడువును పొడిగించింది. ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదీ..

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన స్వరీసుల రద్దు గడువును పొడిగించింది.  ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రకటించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్యాసింజర్ విమానాలను నడపనున్నట్టు పేర్కొంది. కరోనా ఉధృతి నేపథ్యంలో గతేదాడి మర్చి 23న అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత ఆ గడువును జులై 31 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 


Updated Date - 2021-07-31T04:47:01+05:30 IST