రొనాల్డో పదోసారి

ABN , First Publish Date - 2021-10-14T09:10:14+05:30 IST

పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పురుషుల ఫుట్‌బాల్‌లో పదోసారి హ్యాట్రిక్‌ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌లో భాగంగా

రొనాల్డో పదోసారి

  • ఇంటర్నేషనల్‌ హ్యాట్రిక్‌


ఫారో (పోర్చుగల్‌) : పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పురుషుల ఫుట్‌బాల్‌లో పదోసారి హ్యాట్రిక్‌ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌లో భాగంగా లక్సెంబర్గ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ ఫీట్‌ నమోదు చేశాడు. హెడర్‌తో ఒకటి, మిగతా రెండింటిని పెనాల్టీల ద్వారా గోల్స్‌గా మలిచి  హ్యాట్రిక్‌ అందుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 5-0తో లగ్జెంబర్గ్‌ను చిత్తు చేసింది. 

Updated Date - 2021-10-14T09:10:14+05:30 IST