Abn logo
Sep 20 2021 @ 16:36PM

ఏపీని అంతర్జాతీయ మాఫియాకు అడ్డాగా మార్చారు: ధూళిపాళ్ల నరేంద్ర

అమరావతి: ఏపీని అంతర్జాతీయ మాఫియాకు అడ్డాగా మార్చారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.9 వేల కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను అఫ్ఘానిస్తాన్ నుంచి విజయవాడకు ఆశి ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకుందని తెలిపారు. దేశ చరిత్రలో అతిపెద్ద హెరాయిన్ పట్టుకున్న ఘటన ఇదేనని తెలిపారు. తాలిబన్ టు తాడేపల్లికి ఉన్న సంబంధమేంటి? అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. దీని వెనుకున్న బిగ్‌బాస్ ఎవరో తేలాలని డిమాండ్ చేశారు. మాఫియాలు, అక్రమాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్నవారు టీటీడీ బోర్డులో ఉన్నారని విమర్శించారు. టీటీడీని రాజకీయ వేదికగా చూస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర తప్పుబట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption