జూన్ 29, 2021 ఒలింపిక్స్ అర్హతకు గడువు
ABN , First Publish Date - 2020-04-04T09:34:45+05:30 IST
టోక్యో విశ్వ క్రీడలకు అర్హత పొందాల్సిన సమయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. 2021కి వాయిదా వేసిన ఈ క్రీడలకు అర్హత ...
లోసాన్: టోక్యో విశ్వ క్రీడలకు అర్హత పొందాల్సిన సమయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. 2021కి వాయిదా వేసిన ఈ క్రీడలకు అర్హత సాధించే గడువును వచ్చే ఏడాది జూన్ 29గా ఖరారు చేసింది. ఈమేరకు జాతీయ ఒలింపిక్ కమిటీలకు ఐఓసీ డైరెక్టర్ జేమ్స్ మెక్‌లియోడ్ సమాచారం పంపారు. అలాగే టోక్యో క్రీడలకు ఎంట్రీలను పంపేందుకు తేదీని జూలై 5, 2021గా ప్రకటించారు.