అంతర్జాతీయ తెలుగు మినీ కథల పోటీ

ABN , First Publish Date - 2021-06-11T05:52:27+05:30 IST

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు చిన్న కథల పోటీని నిర్వహిస్తున్నాం....

అంతర్జాతీయ తెలుగు మినీ కథల పోటీ

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు చిన్న కథల పోటీని నిర్వహిస్తున్నాం. కథ నిడివి చేతిరాతలో A4లో రెండున్నర పేజీలు, డీటీపీలో ఒకటిన్నర పేజీని మించకుండా పేజీకి ఒకవైపు మాత్రమే ఉండాలి. హామీ పత్రంలో మాత్రమే రచయిత పేరు, పూర్తి చిరునామా, వాట్సప్ నెంబర్, మెయిల్ ఐడీ ఉండాలి. జూన్ 25వ తేదీ లోపు  కథలను పంపాల్సిన చిరునామా: డాక్టర్ ఎస్.ఆర్.ఎస్. కొల్లూరి, సమన్వయ కర్త, ఆంధ్ర సారస్వత పరిషత్, 11-1-4, ఎస్.బి.ఐ. మోబర్లీపేట బ్రాంచ్ బిల్డింగ్, మెయిన్ రోడ్, అమలాపురం- 533201. ప్రవాస భారతీయులు dr.srskolluri@gmail.comకి ఈమెయిల్ చేయాలి. విజేతల వివరాలను జూలై 18న, 10.30కి జరిగే అంతర్జాల కథా సదస్సులో తెలియజేస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: రూ.3,000, 2,000, 1,000, రెండు ప్రత్యేక బహుమతులుగా రూ.500. నగదుతో పాటు ప్రశంసాపత్రాలు అందచేస్తాం. వివరాలకు ఫోన్: 9703115588.

డా. గజల్ శ్రీనివాస్, రెడ్డప్ప ధవేజి

ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు

Updated Date - 2021-06-11T05:52:27+05:30 IST