నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం... ఎలా మొదలయ్యిందంటే...

ABN , First Publish Date - 2020-09-30T14:46:35+05:30 IST

ఈరోజుల్లో అనువాదం అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అనువాద ప్రక్రియ ద్వారా మనం ఏ దేశంలోని భాషనైనా సులభంగా అర్థం చేసుకోగలుగుతాం.

నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం... ఎలా మొదలయ్యిందంటే...

న్యూఢిల్లీ: ఈరోజుల్లో అనువాదం అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అనువాద ప్రక్రియ ద్వారా మనం ఏ దేశంలోని భాషనైనా సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రతీయేటా సెప్టెంబరు 30న నిర్వహిస్తుంటారు. ‘సెయింట్ జెరోమ్‘ పేరిట ఇంటర్నేషనల్ ట్రాన్స్‌లేషన్ డేను నిర్వహిస్తుంటారు. సెయింట్ జెరోమ్ బైబిల్ అనువాదకుడు. ఆయన అనువాదకులను పండితులుగా భావించి గౌరవించేవారు. 



ప్రపంచంలోని అనువాదకులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆప్ ట్రాన్స్‌లేటర్స్(ఎఫ్ఐటీ) అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని 1991లో ప్రారంభించింది. 2017 మే 24న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 30ని అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా ప్రకటించింది. అనువాద కళను ప్రోత్సహించడం, దీని గొప్పదనాన్ని గుర్తించి, అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంతా అనువాదకులంతా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

Updated Date - 2020-09-30T14:46:35+05:30 IST